విజయ సాయి రెడ్డికి జడ్జి చివాట్లు

Publish Date:Jan 4, 2012

Advertisement

హైదరాబాద్:వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఆరెస్టైన  జగతి పబ్లికేషన్స్ ఆడిటర్ విజయసాయి రెడ్డిని ప్రభుత్వ ఉద్యోగిగా సిబిఐ పేర్కొనడంపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్కార్ట్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించవద్దని హెచ్చరించారు. మీ రక్షణ బాధ్యత వారిదేనన్నారు.మీకు ప్రాణహాని జరిగితే ఎస్కార్ట్‌కు ఇబ్బందులుంటాయని సూచించారు. విజయసాయి రెడ్డి రిమాండ్కు సంబంధించి సిబిఐ సమర్పించిన నివేదికపై నాంపల్లి సిబిఐ కోర్టులో ఇరువర్గాలు వాదనలు వినిపించారు.  సిబిఐ ప్రస్తావించిన అంశాలపై కోర్టు విస్మయం వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా సిబిఐ తరఫు న్యాయవాది మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే ఆయనే ప్రథమ ముద్దాయి అన్నారు. వైయస్ సివిల్ సర్వెంట్ అని, ఇంకా ఎవరి పేర్లు కావాలన్నారు.

 కాగా మంగళవారం కూడా సిబిఐ న్యాయమూర్తి విజయ సాయి రెడ్డిని హెచ్చరించారు.  సాయిరెడ్డిని కోర్టులో హాజరు పర్చినప్పుడు ఆయన తరఫు న్యాయవాది వాదనలు ప్రారంభించారు. ఈ సమయంలో అనేక సందర్భాల్లో సాయి రెడ్డి జోక్యం చేసుకొని తన వాదన తానే వినిపించే ప్రయత్నం చేశారు.తనను వీడియో కాన్ఫరెన్సు ద్వారా కాకుండా కోర్టుకు హాజరవడం ద్వారా విచారణ చేయాలని అభ్యర్థించారు. తనపై సిబిఐ చేసిన ఆరోపణలన్నీ అబద్దమని, పేర్కొన్న సెక్షన్లు తనకు వర్తించవన్నారు. దీనిపై సిబిఐ న్యాయవాది ఘాటుగా స్పందిస్తూ సిబిఐ చట్ట ప్రకారమే వెళుతోందని, సిబిఐపై ఆరోపణలు చేస్తున్న మీరు, మీ న్యాయవాది కలిసి సొంతగా చట్టాలు తయారు చేసుకోండని సూచించారు. ఓ సమయంలో సాయిరెడ్డిని ఉద్దేశించి మనకు ఎంత ఆత్రుత ఉండాలో అంతే ఉండాలన్నారు. దాంతో సాయిరెడ్డి వెనక్కి తగ్గారు.ఇదిలా ఉండగా, సిబిఐ దాఖలు చేసిన రిమాండ్ నివేదికలో విజయసాయి రెడ్డిని కీలక వ్యక్తిగా పొల్చడం ఆయన వ్యక్తిగత స్వేచ్ఛని హరించడమేనని ఆయన తరపు న్యాయవాది సుశీల్ కుమార్ వాదించారు. సాయిరెడ్డిని వేధించడానికే సిబిఐ 14 రోజుల కస్టడీ అడుగుతోందని ఆయన అన్నారు.
 

By
en-us Political News

  
ప్రభుత్వ ఉద్యోగం.. అందులోనూ కీలకమైన టౌన్ ప్లానింగ్ అధికారి బాధ్యతలు.
హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ యూనివర్సిటీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
క్రీడా రంగానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా క్రీడలు యువతలో ఉత్సాహాన్ని నింపుతాయని ప్రధాని రేవంత్ తో అన్నట్లు సమాచారం. ప్రధాని మోదీతో జరిగిన ఈ సమావేశం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా  ప్రాధాన్యత సంతరించుకుంది.
అలాగే మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు, సజ్జనార్‌పై  బహిరంగంగా పలు ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారనీ,   పోలీసు యూనిఫాం వెనుక దాక్కున్న నేరస్థుడిగా ఆయన సజ్జనార్ ను అభివర్ణించారనీ తన లేఖలో పేర్కొన్న రాజాసింగ్, అటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న సజ్జనార్ పై చర్యలు తీసుకోకుండా కేవలం బదలీతో సరిపెట్టడమేంటని నిలదీశారు.
అక్వాన్ ప్రభావం ప్రధానంగా తెలంగాణలోని తూర్పు దక్షిణ జిల్లాలపై అధికంగా ఉంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకూ అక్వాన్ ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.  
ఐదు తులాల బంగారం ఆశ.. రెండున్నర తులాల గొలుసు స్వాహా.!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
భారత రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సంపన్నుల ఎదుగుదలపై, ముఖ్యంగా పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ అసాధారణ ప్రగతిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ సంక్షేమ కానుకను అందించేందుకు సిద్ధమైంది.
women cricketer Nandini suicide,BCCI Under 19 cricket, Vikarabad crickete, rFemale cricketer suicide
బీసీ రాజ్యాధికార పాదయాత్రలో తన వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
అక్రమ రవాణా ముఠాలకు సింహస్వప్నం.. వేలాది మంది బాధితులకు విముక్తి.. 2 వేల మందికి పైగా సివిల్ సర్వెంట్లకు మార్గదర్శకత్వం.
రాష్ట్రంలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే అంశాలపై ప్రముఖులు స్పందిస్తుండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.