వైకాపా రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
Publish Date:May 17, 2022
Advertisement
ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను అధికార వైకాపా ఖరారు చేసింది. రాజ్యసభ అభ్యర్థులుగా విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్య పేర్లను ఖరారు చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో బీసీల ఓట్లను కొల్లగొట్టేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో ఎత్తుగడ వేశారు. జాతీయ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను ఏపీ తరఫున రాజ్యసభకు పంపిస్తున్నారు. తెలంగాణకు చెందిన కృష్ణయ్యను పనిగట్టుకుని ఏపీ తరఫున ఊహించని విధంనం అందలం ఎక్కించాలనుకోవడంతో పలువురిలో ఆశ్చర్యం కలుగుతోంది. తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు ఆఫీసులో జగన్ తో మంగళవారంనాడు ఆర్. కృష్ణయ్య భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే ఏపీ నుంచి రాజ్యసభకు పంపించేవారి జాబితాను జగన్ ఫైనల్ చేశారంటున్నారు. అలాగే చివరి నిముషం వరకూ విజయసాయి రెడ్డికి రెండో సారి అవకాశం ఇస్తారా ఇవ్వరా అన్న సస్పెన్స్ కొనసాగింది. అయితే చివరి నిముషంలో విజయసాయికి రెండో సారి అవకాశం ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/ycp-rajya-sabha-candidates-finalised-25-136031.html





