భార్యకు చీర కట్టుకోవడం రాదని సూసైడ్
Publish Date:May 17, 2022
Advertisement
ఆత్మహత్య చేసుకోవడానికి అతి చిన్న కారణం చాలని నిరూపించాడో యువకుడు. అతడు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం తన భార్యకు చీర కట్టుకోవడం రాదని. నమ్మశక్యం కాకున్నా ఇదే నిజం. మహారాషట్రకు చెందిన ఒక పాతికేళ్ల యువకుడికి తన కన్నా పెద్దదైన యువతితో పెళ్లయ్యింది. అయితే ఆమెకు చీర కట్టుకోవడం రాదు. ఈ విషయం దాచి తనకు ఇచ్చి పెళ్లి చేశారని మధన పడిపోయాడు.
ఆమెను చీర కట్టుకోవడం నేర్చుకోమని చిలక్కి చెప్పినట్లు చెప్పాడు. పాపం ఆ యువతి కూడా చీర కట్టుకోవడం నేర్చుకుందుకు శతథా ప్రయత్నించింది. కానీ పాపం రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువకుడు గదిలోకి వెళ్లి తలుపులేసుకుని ఉరేసుకున్నాడు. భర్త ఎంత సేపటికీ గది తలుపులు తీయకపోవడంతో ఖంగారు పడిన అతడి భార్య ఇరుగు పొరుగు వారిని పిలిచింది. వారు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూసేసరిని అతడు దూలానికి ఉరేసుకుని వెళాడుతూ కనిపించాడు.
భార్యకు వంట రాదనీ, ఆమె పుట్టింటి వాళ్లతోనే మాట్లాడుతూ, తన వారిని నిర్లక్ష్యం చేస్తోందనీ, పుట్టింటికి వెళ్లి చెప్పిన సమయానికి తిరిగి రాలేదనీ.. ఇలా చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నవారి సంఖ్యఈ మధ్య ఎక్కువ అవుతున్నది. కారణాలుగా ఇవి పైకి కనబడినా ఇలా ఆత్మహత్యలకు పాల్పడే వారిలో వేరే మానసిక రుగ్మతలు కూడా ఉంటాయన్నది మానసిక నిపుణులు చెబుతున్న మాట.
http://www.teluguone.com/news/content/-husband-sucide-for-wife-dont-know-how-to-weare-saree-25-136034.html





