ఏపీ నుంచి రాజ్యసభకు ఆర్.కృష్ణయ్య.. బీసీల ఓట్ల కోసమేనా!

Publish Date:May 17, 2022

Advertisement

వచ్చే ఎన్నికల్లో బీసీల ఓట్లను కొల్లగొట్టేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో ఎత్తుగడ వేశారు. జాతీయ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను ఏపీ తరఫున రాజ్యసభకు పంపిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణలతో చర్చించి, అభ్యర్థుల జాబితాను ఖరారు చేశారు. ఈ నెలాఖరులో ఖాళీ అయ్యే నాలుగు స్థానాలకు విజయసాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, నిరంజన్ రెడ్డి, ఆర్. కృష్ణయ్యపేర్లను ఖరారు చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.

అయితే.. ఆర్.కృష్ణయ్య జగమెరిగిన బీసీ నేత. బీసీల సంక్షేమం కోసం జాతీయ స్థాయిలో కూడా అనేక ఉద్యమాలు చేశారు. అలాంటి బీసీ పెద్ద ఆర్.కృష్ణయ్యను వైసీపీ అధినేత నేరుగా రాజ్యసభకు పంపాలనే నిర్ణయం తీసుకోవడం వెనుక జగన్ రెడ్డి రాజకీయ ఎత్తుగడ ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే.. తెలంగాణకు చెందిన కృష్ణయ్యను పనిగట్టుకుని ఏపీ తరఫున ఊహించని విధంనం అందలం ఎక్కించాలనుకోవడంతో పలువురిలో ఆశ్చర్యం కలుగుతోంది. తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు ఆఫీసులో జగన్ తో మంగళవారంనాడు ఆర్. కృష్ణయ్య భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే ఏపీ నుంచి రాజ్యసభకు పంపించేవారి జాబితాను జగన్ ఫైనల్ చేశారంటున్నారు.

ఏపీ నుంచి రాజ్యసభకు ఏర్పడే నాలుగు ఖాళీలకు సంబంధించిన షెడ్యూల్ కూడా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ముందుగా వచ్చిన వార్తల ప్రకారం ఏపీ నుంచి రాజ్యసభకు విజయసాయిరెడ్డిని కొనసాగించడంతో పాటు నెల్లూరుకు చెందిన పారిశ్రామికవేత్త, మాజీ టీడీపీ నేత బీద మస్తాన్ రావును కన్ఫం చేశారని అన్నారు. మరో అభ్యర్థిగా ఉత్తరాంధ్రకు చెందిన బీసీ మహిళ, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి ఛాన్స్ ఇస్తారనే వార్త  రాజకీయ వర్గాల్లో హల్ చల్ చేసింది. మరో స్థానాన్ని గుజరాత్ కు చెందిన పారిశ్రామికవేత్త అదాని సతీమణికో లేక ఆయనకో కేటాయించారని గతంలో వార్తలు వచ్చాయి. మరో స్థానంలో న్యాయవాది నిరంజన్ రెడ్డి పేర్లు వినిపించాయి. కాగా.. తాజా పరిణామంలో నాలుగోస్థానంలో కిల్లి కృపారాణికి బదులు బీసీ నేత ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు పంపిస్తుండడం విశేషం.

బీసీ ఓట్ల కోసం జగన్ గాలం వేయడమే కాకుండా ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఉంది. ఇంతకు ముందు ఆర్.కృష్ణయ్య కూడా తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీద మస్తాన్ రావు కూడా టీడీపీ మాజీ నేతే కావడం గమనార్హం. మస్తాన్ రావుతో పాటు ఆర్. కృష్ణయ్యను పెద్దల సభకు పంపించాలనే జగన్ నిర్ణయం వెనుక టీడీపీని దెబ్బతీయాలనే కుటిల యత్నం ఉందని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వస్తున్నాయి.

బీసీ సమస్యలపై ఆర్.కృష్ణయ్య ఎన్నో ఉద్యమాలు నిర్వహించారు. అప్పటి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి కృష్ణయ్య ఎంతో చేరువగా ఉండేవారు. వైఎస్సార్ దృష్టికి తీసుకెళ్లి ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యేలా చేశారు. అయితే.. రాష్ట్ర విభజన తర్వాత ఆర్.కృష్ణయ్య తెలంగాణకే పరిమితం అయ్యారు. అలాంటి ఆర్.కృష్ణయ్యను ఏపీ నుంచి రాజ్యసభ పంపడం ద్వారా బీసీ ట్రంప్ కార్డును తెరమీదకు తీసుకురావాలనే ఎత్తుగడ వైఎస్ జగన్ వేశారంటున్నారు. ఆర్.కృష్ణయ్యను ఎంపిక చేయడం జగన్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమే అంటున్నారు.

By
en-us Political News

  
ప్యారడైజ్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. కానీ థియేటర్‌లో సినిమా చూసే ఆడియన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ సిద్ధమైంది.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.