వైసీపీ ఎంపీ వీరంగం.. అర్థరాత్రి పోలీస్ స్టేషన్లో రచ్చ..
Publish Date:Feb 16, 2022
Advertisement
అర్ధరాత్రి పూట విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఎంపీ నందిగం సురేష్, అతని అనుచరులతో హల్ చల్ చేశారు. కృష్ణలంక ఎస్ఐ, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సురేష్ అనుచరులు పోలీసులతో బాహాబాహీకి దిగారు. సురేష్, ఆయన అనుచరులు చేస్తున్న హంగామాను వీడియో తీస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ ని కొట్టి, ఫోన్ లాక్కుని, ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. గొడవ అనంతరం సురేష్, అనుచరులు వెళ్ళిపోతుండగా గేటు దగ్గరికి వెళ్లి తన ఫోన్ ఇమ్మని మరోసారి అడిగితే మళ్లీ కానిస్టేబుల్ శ్రీనివాస్ ని సురేష్ అనుచరులు కింద పడేసి కొట్టారు. వైసీపీ ఎంపీ నందిగం సురేష్, ఆయన అనుచరులు కృష్ణలంక పీఎస్ పై ఇంతలా విరుచుకుపడడం వెనుక కథ ఏంటంటే.. విజయవాడ బస్టాండ్ ఎదురుగా గంగోత్రి హోటల్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న యువకులను కృష్ణలంక ఎస్ ఐ ఆపారు. అయితే.. తాము ఎంపీ నందిగం సురేష్ అనుచరుల అంటూ ఆ యువకులు హంగామా చేశారు. దాంతో వారిని యువకులను ఎస్ఐ, పోలీసు సిబ్బంబది అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ నందిగం సురేష్ తన అనుచరులతో అర్ధరాత్రి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఎస్ఐ, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సురేష్ అనురులైతే పోలీసులతో బాహాబాహీకి దిగారు. ఈ తతంగాన్ని వీడియో తీస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ ని కొట్టారు. అతని ఫోన్ లాక్కున్నారు. పీఎస్ లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. తన ఫోన్ ఇమ్మని అడిగిన పాపానికి కానిస్టేబుల్ శ్రీనివాస్ ను పీఎస్ గేటు వద్ద మరోసారి కిందపడేసి కొట్టారు. కాగా.. బైక్ పై రాష్ డ్రైవింగ్ చేసిన యువకులలో ఎంపీ నందిగం సురేష్ సమీప బంధువు ఒకరు ఉన్నట్లు సమాచారం. కృష్ణలంక పీఎస్ పై ఎంపీ సురేష్, అతని అనుచరులు దాడిచేసిన విషయాన్ని పోలీస్ అధికారులు గోప్యంగా ఉంచుతుండడం వెనుక ఏ శక్తులు పనిచేస్తున్నాయో అనే అనుమానాలు వస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/ycp-mp-nandigam-suresh-attacked-krishnalanka-ps-39-131842.html





