జగన్నాటకంలో 'విష్ణు' లీలలు.. తిరుపతిలో 'మంచు' స్టూడియో ఎందుకు?
Publish Date:Feb 16, 2022
Advertisement
ఇలా అన్నారు. అలా రెడీ అయ్యారు. ఉత్తిపుణ్యానికి ఇస్తామంటే ఎవరు వద్దంటారు? అయితే, ఆయన ఎవరితోనైతే అన్నారో.. వాళ్లెవరూ ఇంకా ముందుకు రాలేదు. కానీ, ముందే సిద్ధమైన తనవారితో ముందడుగు వేయించారు. అంతా జగన్నాటకం. అందులో విష్ణు లీలలు మామూలుగా లేవంటున్నారు. ఇంతకీ మేటర్ ఏంటంటే... మొన్నామధ్య చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాష్, రాజమౌళి, కొరటాల శివలు తాడేపల్లి ప్యాలెస్ వెళ్లి సీఎం జగన్‌తో చర్చలు జరిపారు. ఈ పేర్లు చూస్తే తెలిసిపోతోందిగా వెళ్లిన వారంతా హేమాహేమీలని. ఆ భేటీలో వీళ్లంతా జగనన్నను వేడుకున్నారు. వీళ్లు చెప్పేదేదో చెప్పారు. జగన్‌రెడ్డి మాత్రం తాను చెప్పాలనుకున్నది మాత్రమే చెప్పారు. వీళ్ల ప్రపోజల్స్ పక్కనపెట్టేసి.. ముఖ్యమంత్రి ఆలోచనలు చెప్పేశారు. తెలంగాణలో ఇన్‌కమ్ తక్కువ.. ఏపీలోనే ఆదాయం ఎక్కువ.. అందుకే టాలీవుడ్ విశాఖకి షిఫ్ట్ కావాల్సిందేనని తేల్చిచెప్పేశారు. కావాలంటే.. సినిమావాళ్లు ఇళ్లు కట్టుకోవడానికి స్థలాలు, స్టూడియోలు పెడతామంటే భూములు ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. మనోళ్ల అలాగే అలాగే అనేసి వచ్చేశారు. ఆ తర్వాత అంతా కామ్. జగన్‌రెడ్డి అంతటి భారీ బొనాంజా ప్రకటించినా.. ఇంతవరకూ టాలీవుడ్ తరఫున ఎవరూ ముందుకు రాలేదు. ఒక్కరు మినహా. ఆ ఒక్కరు ఆయన బంధువే కావడం ఆసక్తికరం. కట్ చేస్తే.. ఆనాడు మీటింగ్ జరిగిన వెంటనే ప్రభుత్వం నుంచి చకచకా ఆదేశాలు వెళ్లిపోయాయి. విశాఖ, తిరుపతి, రాజమండ్రిలో సినిమా పరిశ్రమను ప్రోత్సహించేందుకు భూములు రెడీ చేయమంటూ కలెక్టర్లకు ఉత్తర్వులు వెళ్లాయని తెలుస్తోంది. అదేంటి..? విశాఖకు కదా సినీ పరిశ్రమను ఆహ్వానించింది.. మరేంటి తిరుపతి, రాజమండ్రిలోనూ ఇండస్ట్రీ కోసం భూముల సేకరణ ఏంటి? అనే అనుమానం రాకపోదు. మూడు రాజధానుల మాదిరే.. మూడు ఫిల్మ్‌నగర్‌లు క్రియేట్ చేయాలని అనుకుంటున్నారా? అనే డౌట్. మరి, ఆ రెండు చోట్ల కూడా భూములెందుకో ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. జగనన్న పిలవగానే పోలోమంటూ పోయేందుకు పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. బడా నిర్మాతలు, హీరోలు, దర్శకులు ఒక్కరంటే ఒక్కరు కూడా ఆసక్తి కనబరచలేదు. జగనన్నపై అంత నమ్మకం మరి. కానీ, ఆ వెంటనే ఓ ఇంట్రెస్టింగ్ పరిణామం జరిగిపోయింది. సడెన్‌గా మా అధ్యక్షుడు, జగన్ బావమరిది మంచు విష్ణు తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రత్యక్షమయ్యారు. విందు భోజనంతో.. భూముల పందేరమూ జరిగిపోయిందని తెలుస్తోంది. జగన్‌తో మీటింగ్ తర్వాత బయటకు వచ్చిన విష్ణు.. త్వరలోనే తాను తిరుపతిలో స్టూడియో నిర్మిస్తానని, ఆసియాలోనే బెస్ట్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేస్తానని ప్రకటించేశారు. అంతే. అంతా షాక్. జగన్ ఇలా ఆఫర్ ఇవ్వగానే.. మంచు ఇలా రెడీ పోయారంటే...? అంతకుముందే ఏదో క్విడ్ ప్రోకో నడిచిందా? అనే అనుమానం రాకమానదు. పెద్ద పెద్ద సినీ ప్రముఖులే ఇంకా ఆలోచనలో ఉంటే.. వారితో సరితూగలేని మంచు.. ఇంత తొందరగా స్టూడియోకు సిద్ధమైపోవడమేంటనే చర్చ కూడా నడుస్తోంది. అది కూడా విశాఖలో కాదట.. తిరుపతిలోనట. ఇప్పటికే మంచు ఫ్యామిలీకి తిరుపతిలో విద్యాసంస్థలు ఉన్నాయి. వేల ఎకరాల భూములు కూడా ఉన్నాయి. ఇప్పుడు స్టూడియో, ఇనిస్టిట్యూట్ పేరుతో ప్రభుత్వం నుంచి భారీగా భూములు తీసుకోనున్నారా? జగన్ తన బావమరిది కోసం భూపందేరం సిద్ధం చేశాకే.. ఈ మీటింగ్ ఏర్పాటు చేశారా? అనే డౌట్. మంచుతో మొదలైన ఈ భూముల దానం.. ఇక ముందుముందు ఎవరెవరికి వడ్డిస్తారో..? అందులో, అంతా తనవారే ఉంటారని వేరే చెప్పనవసరం లేదేమో. అయినా, ఒక్క విశాఖలో ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేస్తే బాగుంటుంది కానీ.. మళ్లీ దాన్ని మూడు ముక్కలు చేసి.. వైజాగ్, తిరుపతి, రాజమండ్రి అంటే పరిశ్రమకు వర్కవుట్ అవుతుందా? హైదరాబాద్‌లో ఇండస్ట్రీ అంతా ఫిల్మ్‌నగర్ చుట్టూ కేంద్రీకృతం అయింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, క్రిష్ణానగర్, ఇంద్రానగర్, మణికొండ.. అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్డూడియో, పద్మాలయ స్టూడియో, సారధి స్టూడియో.. ఇలా అక్కడక్కడే అన్ని విభాగాల వారూ అందుబాటులో ఉంటారు. ఇక రామోజీ ఫిల్మ్ సిటీ ఉండనే ఉంది. ఒక్క నగరంలోనే అంతా ఉంటే బెటర్ కానీ.. అదే ఏపీలో విశాఖ, తిరుపతి, రాజమండ్రి అంటుంటే.. ఈ ప్రతిపాదన పరిశ్రమ కోసమా? లేక, తనవారికి భూముల పందేరం కోసమా? అంటున్నారు.
http://www.teluguone.com/news/content/why-manchu-vishnu-studio-in-tirupati-39-131844.html





