ఆంధ్రప్రదేశ్ అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మను ఫ్యాన్ పార్టీలోని నేతలే మరిచిపోయారా? అంటే ఆ పార్టీలోని ఓ వర్గం నుంచి అవుననే సమాధానం వస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైయస్ విజయమ్మతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఇరువురు మధ్య పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో మంత్రి కావాలనుకున్న నీ ఆశయం.. ఎలాగైనా సాధించావంటూ ఈ సందర్బంగా ఆర్కే రోజాను వైయస్ విజయమ్మ భుజం తట్టి మరీ అభినందించినట్లు సమాచారం.
అలాగే వైయస్ విజయమ్మను కూడా ఆర్కే రోజా.. తన మాటల పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసినట్లు సమాచారం. అయితే విజయమ్మను మంత్రి రోజా కలవడం సరే... మిగిలిన మంత్రులంతా ఏమయ్యారని సదరు వర్గంలోని వారు ప్రశ్నించుకొంటున్నారట. ఓ రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉంది.. ఈ నేపథ్యంలో విజయమ్మ అధికార పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు. అలాంటి ఆమెను జస్ట్ ఓ కర్టసీగా కలిస్తే ఏమవుతోందనే ఓ చర్చ అయితే వారి మధ్య హాట్ హట్‌గా నడుస్తోందట. గౌరవాధ్యక్షురాలిగా ఆమెకు గౌరవం ఇవ్వకుంటే.. పోని ఓ మహానేత భార్యగా ఆమెకు ఇప్పటికి ఓ గౌరవం అయితే అలాగే ఫిక్స్ అయి ఉంది. ఆ గౌరవాన్ని ఆ పార్టీలోని వారే తుంగలోకి తొక్కితే ఎలా అనే ప్రశ్న సదరు వర్గం నేతలు ప్రశ్నిస్తున్నారట. పోని జగన్ కేబినెట్‌లో కొనసాగుతోన్న బొత్స, ధర్మానలు సైతం నాడు మహానేత కేబినెట్‌లో ఉన్నారు.. వీళ్లు కూడా ఆమెను కలవకపోవడం ఏమిటనే సదరు వర్గం సందేహం వ్యక్తం చేస్తోంది.
అయితే మంత్రులుగా వీరంతా మహా బిజీ బిజీగా ఉన్నారనుకుందాం.. కానీ వీరంతా మంత్రులు కాగానే వీరిలో చాలా మంది విశాఖ శారదా పీఠానికి క్యూ కట్టి.. మరీ ఆ మఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర స్వామిని కలిసి.. ఆయనకు సాస్టాంగ నమస్కారాలే కాదు.. ఫలం, పుష్పం, తొయం అంటూ అన్ని సమర్పించేశారన్న విషయం అటు మీడియాలోనే కాదు ఇటు సోషల్ మీడియాలో సైతం వైరల్ అయిందన్న సంగతి అందరికీ తెలిసిందే.
దీంతో ఈ స్వామిలోరి విలువ అంత కూడా పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేయలేదా? అనే సందేహాలు అయితే పార్టీలోని వారిలోనే కాదు.. ప్రజల్లో సైతం వ్యక్తమవుతోంది. పోని వైయస్ విజయమ్మను కలిస్తే... తమ పార్టీ అధినేత, సీఎం జగన్ ఫీలవుతారనే ఓ భావన ఈ కేబినెట్ మంత్రుల్లో ఉందేమోననే ఓ చర్చ కూడా సదరు వర్గంలో మహా రంజుగా నడుస్తోంది.
గతంలో సీఎం వైయస్ జగన్ సమీప బంధువు... తాజాగా మాజీ అయిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. గతంలో తెలంగాణలో పార్టీ పెట్టి.. పాదయాత్ర చేపట్టిన వైయస్ షర్మిలను కలిశారు. ఈ విషయం సీఎం జగన్ దృష్టికి రావడంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డిని పక్కన పెట్టారని సమాచారం. ఆ క్రమంలోనే ఆయన తాజా కేబినెట్‌లో ఆయన మంత్రి పదవికి దూరమయ్యారనే ఓ చర్చ కూడా ఉంది. మరోవైపు తాను జగన్ బంధువు కావడం వల్లే మంత్రి పదవి దక్కలేదంటూ బాలినేని స్వయంగా మీడియా ముందు పేర్కొనడం గమనార్హం. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను కలిస్తే.. తమకు కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డికి పట్టిన గతే పడుతుందనే ఓ విధమైన భయాందోళనలో సదరు మంత్రులకు ఉందని అందుకే... వారు ఆమెను కలవడం లేదనే ఓ చర్చ అయితే ఫ్యాన్ పార్టీలోని ఓ వర్గంలో యమ జోరు జోరుగా నడుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-forgort-jagans-mother-25-135435.html
Publish Date:Jul 10, 2026
ఈ ఏడాదే పాదయాత్ర ప్రారంభిస్తానని కేటీఆర్ స్వయంగా ప్రకటించి కూడా వెనక్కు తగ్గడంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ మంత వ్యతిరేకత కనిపించడం లేదన్న అవగాహనతోనే కేటీఆర్ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారన్న చర్చ జరుగుతోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య సమక్షంలో కమలం కండువా కప్పుకుని బీజేపీలో చేరారు. వీరు ముగ్గురూ ఇలా బీజేపీలో చేరారో లేదో అలా బీజేపీ హైకమాండ్ వీరి రాజీనామాతో ఖాళీ అయిన ఆ మూడు రాజ్యసభ స్థానాల ఉపఎన్నికలకే వీరినే తమ అభ్యర్థులుగా ప్రకటించింది.
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్‌కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు.
ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్‌లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.