ధ్రప్రదేశ్ లో ఓ పక్క శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా తయారై అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న అనుమానం కలుగుతుంటే.. మరో పక్క అత్యంత కీలకమైన విద్యాశాఖ మంత్రి ఉన్నట్టా లేనట్టా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అసలు బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రేనా అని పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఏపీ మంత్రి వర్గ విస్తరణలో భాగంగా సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణను గత మునిసిపల్ శాఖ నుంచి మార్చి విద్యాశాఖ ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్. తనకు ప్రాధాన్యత లేని శాఖ ఇచ్చారని బొత్స అలిగారని చెబుతున్నారు. మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ జరిగి పక్షం రోజులు గడుస్తున్నా.. ఆయన అలక వీడలేదు. మంత్రిగా బాధ్యతలు చేపట్టలేదు. సీఎంను కలుద్దామన్న ఆయన ప్రయత్నాలు ఫలించలేదని అంటున్నారు.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన అనంతరం ఇప్పటి వరకూ విద్యాశాఖకు సంబంధించి కనీసం నాలుగు సమీక్షలు జరిగాయి.. వాటి వేటికీ బొత్స సత్యనారాయణ హాజరు కాలేదు. ఈ మధ్య కాలంలో ఆయన అడపాదడపా విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు. ఏ సందర్భంలోనూ కూడా విద్యాశాఖకు సంబంధించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం టెన్త్ పరీక్షలు జరుగుతున్నాయి. టెన్త్ క్వశ్చన్ పేపర్లు లీకౌతున్నాయి. అయినా బొత్స నోరు మెదపడం లేదు. ఆయన ప్రమేయం లేకుండానే టీచర్ల సస్పెన్షన్లు జరుగుతున్నాయి. ముందు ముందు ఇంటర్ పరీక్షలు జరగాల్సి ఉంది. వచ్చే నెలలో విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. విద్యాశాఖకు అత్యంత కీలకమైన సమయం ఇది. ఇటువంటి సమయంలో ఆ శాఖ మంత్రి అంటీముట్టనట్టు వ్యవహరిస్తుంటే పరిస్థితి ఏమిటి?
అయినా ఒక కీలక శాఖకు చెందిన మంత్రి ఇన్ని రోజులుగా పదవీ బాధ్యతలు చేపట్టకుండా తన నిరసన వ్యక్తం చేస్తుంటే సీఎం పట్టనట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు. నిజంగానే ప్రభుత్వం దృష్టిలో విద్య అన్నది అప్రధాన్య అంశమా? విద్యార్థుల భవిష్యత్ పై ప్రభుత్వానికి శ్రద్ధ లేదనుకోవాలా?
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం రాష్ట్రంలో పాలన మరింత అస్తవ్యస్థమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుభవజ్ణులకు అప్రధాన్య శాఖలు, కొత్తవారికి కీలక శాఖలు అప్పగించిన ఫలితం పాలనపై ప్రస్ఫుటంగా కనిపిస్తున్నదని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఏ సమస్యపైనైనా స్పందించి ప్రభుత్వ వాదనను వినిపించే సీనియర్లు అలుకబూని మౌనంగా ఉండటంతో మొత్తం ప్రభుత్వంలోనే స్తబ్దత ఏర్పడిందని అంటున్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న అనుమానం కలుగుతోందని అంటున్నారు. ఏం ఉన్నా లేకపోయినా విపక్షంపై విరుచుకుపడుతూ విమర్శలు గుప్పించే కొడాలి నాని, పేర్ని నాని వంటి వారు మంత్రిపదవులు కోల్పోయి మౌనంతో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే.. బొత్స వంటి వారు బాధ్యతలు చేపట్టకుండా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు రాజధానే కాదు..ప్రభుత్వమూ లేని రాష్ట్రంగా మారిపోయిందని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/is-botsa-education-minister-25-135431.html
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్‌కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు.
ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్‌లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.