కొట్టుకున్న వైసీపీ కౌన్సిలర్లు.. నాయకులా? రౌడీలా?
Publish Date:Mar 31, 2022
Advertisement
వైసీపీ అంటేనే అరాచక పార్టీ. వైసీపీ నేతలంటేనే అరాచక వాదులు. ఇలా విపక్షం నిత్యం విమర్శిస్తూనే ఉంటుంది. అధికార పార్టీ చేష్టలు కూడా అలానే ఉంటుంటాయి. అందలం ఎక్కింది మొదలు.. ప్రతిపక్ష టీడీపీనే టార్గెట్ చేస్తూ వస్తోంది. హత్యలు, దాడులు, కేసులు, కుట్రలతో భయాందోళనలకు గురి చేస్తోందనే ఆరోపణ ఉంది. ఇన్నాళ్లూ టీడీపీపై విరుచుకుపడిన వైసీపీ నేతలు.. ఫర్ ఏ ఛేంజ్.. ఈసారి వారిలో వారు గొడవ పడ్డారు. జస్ట్ గొడవంటే గొడవ కాదు.. రౌడీల్లా కొట్టుకున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు కౌన్సిల్ వేదికగా వీరంగం సృష్టించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు కొట్టుకున్నారు. సమావేశం మధ్యలో ఒకరినొకరు నెట్టుకున్నారు. 13వ వార్డులో తాగునీటి సమస్యను పట్టించుకోవడం లేదంటూ కౌన్సిలర్ ఇర్ఫాన్ ఆరోపించగా.. వైస్ ఛైర్మన్ ఖాజా మొహియుద్దీన్ ఆయనతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఘర్షణ జరిగి కౌన్సిలర్ల మధ్య తోపులాటకు దారితీసింది. చాలా చేసు అరుపులు, కేకలు, గొడవతో కౌన్సిల్ హాల్ మారుమోగిపోయింది. పోలీసులు జోక్యం చేసుకొని వైసీపీ నేతలను కంట్రోల్ చేయాల్సి వచ్చింది. కడప రాజ్యంలో.. రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఇదే నేమో అంటున్నారు. మరోవైపు, చిత్తూరు జిల్లాలోని మదనపల్లి మున్సిపల్ సమావేశంలోనూ ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ మహిళా కౌన్సిలర్లపైకి వైస్ చైర్మన్ వెంకట చలపతి దూసుకెళ్లారు. మహిళా దినోత్సవం రోజు మహిళా కౌన్సిలర్లను పిలువకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని టీడీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. సమాధానం చెప్పాల్సిన చైర్‌పర్సన్ స్థానంలో ఉన్న మనూజ మౌనంగా ఉండిపోయారు. ఆమెకు మద్దతుగా.. వైస్ చైర్మన్ రెచ్చిపోయారు. టీడీపీ కౌన్సిలర్ వైపు దూసుకొచ్చారు. దీంతో సమావేశంలో గందరగోళం ఏర్పడింది. ఇలాంటి వైసీపీ నేతల ఓవరాక్షన్‌పై ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
http://www.teluguone.com/news/content/ycp-councillors-fighting-in-proddatur-council-25-133764.html





