కేబినెట్‌లోకి మేక‌పాటి కీర్తిరెడ్డి!

Publish Date:Mar 31, 2022

Advertisement

వైయస్ జగన్ తన కొత్త కేబినెట్‌ కూర్పు పూర్తయిందని.. ఈ కేబినెట్‌లోకి మేకపాటి శ్రీకీర్తిని తీసుకోవాలని ఆయన నిర్ణయించినట్లు సమాచారం. ఆమెకు మంత్రి పదవి కట్టబెట్టి.. ఆ తర్వాత ఆమెను ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిపి.. గెలిపించుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే శ్రీకీర్తి ఇప్పటి వరకు ఎప్పుడు రాజకీయాల్లో లేరు.. అమె మామ మేకపాటి రాజమోహన్ రెడ్డి, చిన్నమామ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితోపాటు ఆమె భర్త మేకపాటి గౌతమ్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నా.. శ్రీకీర్తి మాత్రం.. తన కుటుంబమే లోకంగా ఉన్నారని.. అలాంటి ఆమెకు రాజకీయాల గురించి బొత్తిగా అవగాహన లేదనే ఓ టాక్ అయితే ఆత్మకూరు నియోజకవర్గంలో బలంగా నడుస్తోంది. 

మరోవైపు ఆమెకు రాజకీయాల పట్ల అయిష్టత ఉందని.. ఇదే విషయాన్ని మేకపాటి ఫ్యామిలీ సీఎం జగన్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. మేకపాటి కుమారుడు, కుమార్తె కూడా చిన్న వయస్సు వారే కావడం... మేకపాటి రాజమోహన్ రెడ్డి వయస్సు రీత్యా.. రాజకీయాలకు దూరంగా ఉండడం.. ఇక మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరులు సైతం రాజకీయాల పట్ల అయిష్టత వ్యక్తం చేయడం వంటి తదితర కారణాల నేపథ్యంలో శ్రీకీర్తిని రంగంలోకి దింపాలని జగన్ పార్టీలోని కీలక నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. మేకపాటి శ్రీకీర్తికి మంత్రి పదవి కట్టబెట్టడం వల్ల చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తోందనే ఓ చర్చ సైతం తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా వైరల్ అవుతోంది. 

ఇటీవల మేకపాటి గౌతమ్ రెడ్డి సంస్మరణ సభ జరిగింది. ఈ సభలో సీఎం జగన్ పాల్గొని.. చిన్ననాటి నుంచి గౌతమ్ రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని సభ వేదికపై నుంచి వివరించారు. అలాగే కాంగ్రెస్ పార్టీని వీడి.. తాను కొత్త పార్టీ స్థాపించినప్పుడు.. గౌతమ్ వల్లే .. ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి తనకు మద్దతుగా నిలిచారని సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. గౌతమ్ రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం కూడా తానేనంటూ సీఎం జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

అలాగే గౌతమ్ రెడ్డి కుటుంబానికి పార్టీతో పాటు అంతా అండగా ఉంటామని సీఎం జగన్ భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేబినెట్‌లోకి శ్రీకీర్తిని తీసుకుంటారంటూ సోషల్ మీడియాలో వైయస్ఆర్ సీపీ కేడర్ జోరుగా చర్చించుకొంటూంది. ఆమెకు పవర్ ఫుల్ శాఖను కట్టబెట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. 

మరోవైపు ఈ ఉప ఎన్నికల్లో మేకపాటి ఫ్యామిలీ అభ్యర్థి బరిలోకి దిగితే.. తమ అభ్యర్థిని నిలపకూడదని ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇంకో వైపు.. ఇదే జిల్లాకు చెందిన కొవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిని కూడా జగన్ కేబినెట్‌లోకి తీసుకుంటారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగన్ పార్టీలో ఉన్న సీనియర్లలో ఆయన కూడా ఒకరన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు వ్యవసాయ లేదా భారీ నీటి పారుదల శాఖను కేటాయించే అవకాశం ఉందని సమాచారం.

By
en-us Political News

  
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడాయా ఖాతాలలో అంగన్ వాడీలకు సెల్ ఫోన్ల వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందంటూ వచ్చిన వరుస పోస్టులు తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించాయని సీతక్క ఆ నోటీసులో పేర్కొన్నారు.
తమిళనాడులో ఆదివారం జరిగిన ఒక రోడ్‌షోలో హలోగ్రాఫిక్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు. విజయ్ స్వయంగా అక్కడ ప్రచారంలో పాల్గొన లేదు. కానీ ఏఐ ద్వారా విజయ్ రూపం, గొంతుఓటర్ల ముందుకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
డిజిటల్ మీడియా, ఆ తరువాత త్వరలోనే పూర్తి స్థాయి శాటిలైట్ చానల్ అని ప్రకటిస్తూ విజయ సాయి రెడ్డి.. ఆ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే అలా విమర్శించి ఊరుకోకుండా అమరావతిలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం అంటే దీక్ష చేస్తున్న రామచంద్రయాదవ్ కు మద్దతు ప్రకటించారు.
కేంద్రం ఇంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడం, పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఇందుకు సంబంధిచిన బిల్లు ఆమోదం పొందడం, ఆ వెంటనే రాష్ట్రపతి సంతకం, గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఎలాంటి జాప్యం లేకుండా సాగిపోవడం వెనుక ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఆ విషయంలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కీలక చర్చ జరుుగుతోంది.
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.