ప్రకాష్ రాజ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి..బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్..!

Publish Date:Jul 5, 2026

Advertisement

 

సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొందరు ఉద్దేశపూర్వకంగా కుట్రపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. శనివారం పుట్టపర్తిలో మీడియాతో మాట్లాడిన విష్ణువర్ధన్ రెడ్డి, హిందూ ధర్మం, శ్రీరాముడు, సీతాదేవిపై అవమానకర వ్యాఖ్యలు చేస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. అలాంటి వ్యాఖ్యల ద్వారా సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రకాష్ రాజ్‌కు సంబంధించిన ఒక ఆడియో బయటపడటం ఈ వ్యవహారానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

అదేవిధంగా దేశ ప్రధాని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఇటువంటి వ్యాఖ్యలను ప్రభుత్వం, పోలీసులు ఏమాత్రం ఉపేక్షించరాదని, వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కొందరు కూడా సహకరిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో సమగ్ర విచారణ జరిపించి, కుట్రలో పాల్గొన్న వారందరినీ గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

By
en-us Political News

  
ఉద్యోగాలు, ఉపాధి కోసం నగరంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, శివారు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు ప్రతిరోజూ ప్రయాణించే వారికి రాత్రివేళ ప్రజా రవాణా కొరత ఇబ్బందిగా మారుతోంది.
ఫార్ములా ఈ-కార్ రేస్‌ కేసులో నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో మంగళవారం విచారణ జరిగింది.
ఎల్‌ఐసీ ఆన్‌లైన్ పోర్టల్‌లో క్రెడిట్ కార్డ్ ద్వారా ప్రీమియం చెల్లింపుల సదుపాయాన్ని హఠాత్తుగా నిలిపివేశారు. పేమెంట్ గేట్‌వే ఛార్జీల వివాదమే దీనికి కారణమా పూర్తి వివరాలు, ప్రత్యామ్నాయ చెల్లింపు మార్గాలు ఇక్కడ తెలుసుకోండి.
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదిత అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రముఖ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత షావుకారు జానకి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.
వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు.   ఆమె భౌతికకాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం చెన్నైలోని తేనాంపేట, సెంట్ ఆఫ్‌ రోడ్‌లో ఉన్న ఆమె నివాసంలో ఉంచారు.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుంది.. !
రాష్ట్రపతికి సునీత లేఖ తర్వాత కేసును ఈడీ టేకాఫ్..!
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేగుతోంది.
 ఘటనా స్థలాన్ని సందర్శించిన మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. భద్రతా నియమాలు పాటించకపోవడం, క్రమశిక్షణా రాహిత్యం కారణంగానే ఈ ఘోరం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్థారంచారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.