యానాం కర్మాగారం లాకౌట్,చేతులెత్తేసిన చైర్మన్

Publish Date:Feb 1, 2012

Advertisement

యానాం: యానాంలోని రీజెన్సీ సిరామిక్స్ మూతపడింది.సంస్థకు లాకౌట్ ప్రకటిస్తూ యాజమాన్యం  ఉదయం ప్రకటన చేసింది. దీంతో కర్మాగారంలో పనిచేస్తున్న 6 వేల మంది కార్మికుల భవితవ్యంపై అంధకారం అలుముకుంది. నష్టాన్ని అంచనా వేసే వరకు కర్మాగారాన్ని తెరిచే అవకాశం ఉండదని యాజమాన్యం చెబుతోంది.  విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యాసంస్థలను నడిపే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, అది కూడా సాధ్యమయ్యే పరిస్థితి లేదని రీజెన్సీ సిరామిక్స్ చైర్మన్ నాయుడు మాటలను బట్టి అర్థమవుతోంది. సంస్థలను తాను వదిలేసినట్లేనని ఆయన అన్నారు. అక్కడి పరిస్థితి సాధారణంగా లేదని, తీవ్రమైన భయాందోళనలు నెలకొన్నాయని, అక్కడికి ఎవరూ వెళ్లే పరిస్థితి లేదని ఆయన అన్నారు. బెదిరిస్తూ ఫోన్లు కూడా వస్తున్నాయని చెబుతున్నారని ఆయన అన్నారు. అక్కడి పరిస్థితి వల్లనే లాకౌట్ ప్రకటించినట్లు ఆయన ఓ టీవీ చానెల్ ప్రతినిధితో  అన్నారు. దుర్మార్గులు కంపెనీలో చేరి చెడగొట్టారని ఆయన అన్నారు. యానాంలోని కర్మాగారానికి వెళ్లే పరిస్థితి కూడా లేదని ఆయన అన్నారు. విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా భయపడుతున్నారని ఆయన అన్నారు. కర్మాగారంపై దాడి, దానికి సంబంధించిన సంఘటనల్లో బయటివారి పాత్ర ఉందని ఆయన అన్నారు.

By
en-us Political News

  
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు.
అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది.
తెలంగాణ రాజకీయాల్లో సన్నవడ్ల సాగు అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బాసరలోని  రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం  ట్రిపుల్ ఐటీ లో అసాధారణ పరిణామాలు చోటుచేసుకున్నాయి. క్యాంపస్‌లో వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎల్ నినో ఎఫెక్ట్ తో అక్కడ   నీటి ఎద్దడి తీవ్రతరమైంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా, స్థానిక నీటివనరుల్లో నీటి లభ్యత లేకుండా పోయింది.
తెలంగాణ భవన్ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.