Publish Date:Apr 26, 2026
సైబరాబాద్ కమిషనరేట్‌లో నార్సింగి సీఐ హరికృష్ణ రెడ్డి పై స్వాతి అనే యువతి ఫిర్యాదు చేసింది. విజయనగరం జిల్లాకు చెందిన సాయికిరణ్ పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి కొంతకాలం సహజీవనం చేపి మోసం చేశాడనీ, దీంతో తాను గత ఏడాది అక్టోబర్‌లో నార్సింగి పోలీస్ స్టేషన్‌లో సాయి కిరణ్‌పై ఫిర్యాదు చేసినట్లు స్వాతి పేర్కొంది. అయితే నార్సింగ్ సీఐ హరికృష్ణ రెడ్డి ఇన్ని నెలలు గడిచినా కూడా సాయి కిరణ్ పై సరైన విచారణ జరగలేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. తాను సాయి కిరణ్ వాళ్ల ఊరు విజయనగరం కు వెళితే... అక్కడ అతని తండ్రి రాజకీయ కార్యకర్త కావడంతో ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు తనపై దాడి చేశారని స్వాతి ఆరోపించారు.
ఇక్కడ ఉన్నది మా ప్రభుత్వం.. కేసు పెట్టినా ఏం జరగదు.. చంపేస్తామంటూ బెదరించారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను అక్కడ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేయబోతే.. వారు హైదరాబాద్ లోనే ఫిర్యాదు చేయమన్నారని పేర్కొన్న స్వాతి.. గత ఆరు నెలలుగా తాను నార్సింగి పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని పేర్కొంది. నాన్‌బెయిలబుల్ సెక్షన్లు ఉన్నప్పటికీ నిందితుడిని అరెస్ట్ చేయకుండా సీఐ వెసులుబాటు కల్పిస్తున్నా రని ఆరోపించింది. కేసును రీ-ఇన్వెస్టిగేషన్ చేసి నిష్పాక్షికంగా విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/woman-files-complaint-against-narsingi-ci-at-cyberabad-commissionerate-36-218311.html
ప్రధాని ఐఐటీ ఢిల్లీ పర్యటన ఘటనపై అసదుద్దీన్ విమర్శలు..!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పరీక్షల వివాదం, తదనంతర పరిణామాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారిగా ఈ అంశంపై స్పందించారు.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ చింతాడ రవికుమార్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు శనివారం నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు.
సామాజిక మాధ్యమాలు, డేటింగ్ యాప్‌ల వేదికగా అమాయకులకు వలవేసి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న సంచలన హనీట్రాప్ ముఠా గుట్టు
మియాపూర్ జీఎస్ఎమ్ మాల్ వద్ద ఘోర ప్రమాదం..!
ప్రపంచ ఫుట్‌బాల్ రంగాన్ని శాసించిన మహా దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ జీవితంలో తీరని శోకం అలముకుంది.
క్యాబ్ డ్రైవర్ నుంచి కార్పొరేట్ లీడర్‌గా స్ఫూర్తిదాయక ప్రయాణం..!
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఒక సంచలనాత్మక నిర్ణయం దిశగా ఆలోచన చేస్తోంది.
తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య జరిగి ఏడున్నర సంవత్సరాలు అయిందని, ఇప్పటికీ తాను న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నానని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టను న్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
2015లోనే అప్పటి పాక్ జలవనరులు, విద్యుత్ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ జాతీయ స్థాయిలో నీరు, గ్యాస్, విద్యుత్ విచ్చలవిడిగా దుబారా చేసే అలవాటు వల్లే దేశంలో తీవ్ర కొరత ఏర్పడిందని బాహాటంగా చెప్పారు. నీటి సమస్యలు పూర్తిగా పాకిస్థాన్ అంతర్గత వ్యవహారమని, దానికి బయటి దేశాలను బాధ్యులను చేయలేమని అన్నారు. నాటి మంత్రి వ్యాఖ్యలకు, నేటి పాక్ పాలకులు భారత్‌పై చేస్తున్న ఆరోపణలకు పొంతనే లేకపోవడం గమనార్హం.
ఒంటరిగా ఫీలవుతున్నారా? మీతో కాఫీ తాగేందుకు, సినిమాకు వెళ్లేందుకు అందమైన అబ్బాయి కావాలా? అదీ 50 శాతం డిస్కౌంట్‌తో!