Publish Date:Apr 26, 2026
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత మరోసారి విదేశీ పర్యటన వెళ్లారు. ఆ సందర్బంగా ఆయన కొత్త లుక్ లో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన కొత్త లుక్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఎప్పుడూ తెల్ల చొక్కా, ఖాదీ ప్యాంటుతో కనిపించే జగన్.. విదేశీ పర్యటనల సమయంలో పూర్తి భిన్నంగా మోడ్రన్ లుక్‌లో కనిపించడం రివాజే.
జగన్ తన ఫారిన్ టూర్ కోసం ఇప్పటికే ఇప్పటికే న్యాయస్థానం నుంచి అవసరమైన అన్ని అనుమతులూ పొందిన సంగతి తెలిసిందే.
అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్నందున జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పని సరి అన్న సంగతి విదితమే. అది పక్కన పెడితే.. ఈ పర్యటనలో భాగంగా జగన్, ఆయన సతీమణి భారతీ లండన్ లండన్‌లో ఉంటున్న తన కుమార్తెలు హర్షా రెడ్డి, వర్షా రెడ్డిలను కలుసుకోవడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని సమాచారం.
కాగా జగన్ తాజా విదేశీ పర్యటనకు సంబంధించి కోర్టు ఈ సారి కఠిన షరతులు విధించింది. లక్ష రూపాయల పూచీకత్తుతో పాటు, విదేశాల్లో ఉండే సమయంలో ఆయన ఉపయోగించే ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడిలు, పూర్తి చిరునామాను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. పర్యటన ముగిసిన వెంటనే తిరిగి వచ్చి కోర్టు విచారణకు హాజరు కావాలని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-foriegn-new-look-36-218303.html
జెన్ జీ దెబ్బకు మోదీ అర్ధరాత్రి ఇన్‌స్టా వీడియో పెట్టాల్సి వచ్చింది..!
నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు.. శెహభాష్..లోకేష్` అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భుజం తట్టారు.
ఏపీ రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు కేవలం విమర్శలు, ప్రతివిమర్శలకే పరిమితం కాకుండా, శాంతిభద్రతలు వ్యవస్థల పనితీరుపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇటీవల చేపడుతున్న పరామర్శ యాత్రలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్, ఆ సంస్థ మాజీ ఛైర్మన్ అనిల్ డి. అంబానీతో పాటు పలువురు గుర్తుతెలియని ప్రభుత్వ అధికారులు, ఇతర వ్యక్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది.
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ఆధ్వర్యంలో పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లోని వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో మరొక అద్భుతమైన చారిత్రాత్మక ఘట్టం నమోదైంది.
ఉత్తరాంధ్ర ప్రగతికి ప్రతిరూపంగా నిలిచే భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంపై
విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు కోసం భూములు ఇచ్చిన రైతులే ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని సీఎం చంద్రబాబు అన్నారు.
దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తీపి కబురు అందించాయి.
మోదీ వికసిత్ భారత్... సీబీఎన్ విజన్ ప్రతిరూపం భోగాపురం..!
ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి మహత్తర అడుగు పడింది.
పెళ్లైన నెలలకే షాక్..ఆస్ట్రేలియా ఉద్యోగం పేరుతో ఘరానా మోసం..!