బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో సంచలనం..!

Publish Date:Sep 9, 2026

Advertisement

ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!

బొల్లారం ఆర్మీకి చెందిన ఆయుధాల చోరీ కేసులో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఆయుధాలు ఒకేసారి చోరీ కాలేదని, గత మూడు నెలలుగా ఒక్కొక్కటిగా దశలవారీగా మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారులను మిలటరీ ఇంటెలిజెన్స్ (ఎంఐ) అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బొల్లారంలోని ఆర్మీ ప్రాంగణంలో ఇటీవల నిర్వహించిన ఆయుధాల ఆడిట్‌లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి కనిపించకపోవడం వెలుగులోకి వచ్చింది. 

గత వారంలో చేపట్టిన ఆడిట్ సందర్భంగా అసలు విషయం బయటపడింది. మొత్తం నాలుగు ఏకే-47 రైఫిల్స్, రెండు ఇన్సాస్ రైఫిల్స్, తొమ్మిది పిస్టల్స్‌తో పాటు సుమారు 2,000 బుల్లెట్లు కనిపించకుండా పోయినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఆయుధాలు, బుల్లెట్లు ఒకేసారి అదృశ్యం కాలేదని.. గత మూడు నెలలుగా దశలవారీగా ఒక్కొక్కటిగా మాయమైనట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆయుధాల భద్రత, స్టాక్ నిర్వహణ, ఆయుధాల రాకపోకలకు సంబంధించిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆయుధాలు కనిపించకుండా పోయిన తర్వాత వాటిని బయట వ్యక్తులు చోరీ చేసినట్లు కనిపించేలా ‘సీన్ క్రియేట్’ చేసినట్లు దర్యాప్తులో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

దీంతో ఈ కేసులో ‘బయటి వ్యక్తుల’ ప్రమేయం కంటే ఆర్మీకి సంబంధించిన అంతర్గత వ్యక్తుల పాత్రపై దర్యాప్తు సంస్థలు ప్రధానంగా దృష్టి సారించారు. మాయమైన ఆయుధాలు, బుల్లెట్లు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి? వాటిని ఎవరు తరలించారు? ఎందుకు దశలవారీగా బయటకు తరలించారు? అనే కోణాల్లో మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. 

అదుపులో ఉన్న ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారుల నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.  ఈ కేసును మిలటరీ ఇంటెలిజెన్స్‌తో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), పోలీసులు కూడా వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మాయమైన ఆయుధాలు ఎక్కడికి చేరాయన్న అంశం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

 

 

 

(Bollaram Army weapons theft case, NIA, Military Intelligence, indian army, PM MODI, Home minister amit shah, Telugu One, Telugu News)

By
en-us Political News

  
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ రాయదుర్గంలో ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగిపై ఫుడ్ వెండర్ షేక్ నబీ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 43 లక్షలు నొక్కేసి మూడేళ్లు వేధించిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఎన్‌టీపీఎస్ కాలువలో లభించిన మహిళ శరీర భాగాల మిస్టరీ వీడింది. చేతిపై ఉన్న ఈక టాటూ ఆధారంగా మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కళ్యాణిగా గుర్తించిన పోలీసులు, విచారణలో మటన్ షాప్ షఫీ చేసిన కిరాతక హత్యను ఛేదించారు.
కన్యాకుమారి యూట్యూబర్ ఇంట్లో ఏకంగా 118 సవర్ల (944 గ్రాములు) బంగారం, భారీగా నగదు చోరీకి గురయ్యాయి. సోషల్ మీడియాలో రీల్స్ కోసం చూపించిన సంపదే దొంగలను ఆకర్షించిందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.