Publish Date:Apr 28, 2025
మాజీ ముఖ్యమంత్రి జగన్ టీం మొత్తం ఇప్పుడు విజయవాడ జిల్లా జైలులో ఊచలు లెక్కపెడుతోందా? అంటే అందరూ కాకపోయినా చాలా మంది పరిస్థితి అలాగే ఉందని సమాధానం వస్తుంది.
Publish Date:Apr 28, 2025
అమరావతి పనుల పున: ప్రారంభానికి మే2న ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు షెడ్యూల్ కూడా ఖరారైంది. మోడీ పర్యటనను విజయవంతం చేయడానికి ఏర్పాట్లన్నీ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.
Publish Date:Apr 28, 2025
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో జగన్‌కు అత్యంత సన్నిహితుడైన కసిరెడ్డి రాజశేఖరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఏ4 గా నమోదు అయిన రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఇటీవల సీఐడీ అధికారులు విచారించారు. తర్వలో మరోసారి విచారణకు హాజరు అవ్వాలని నోటీసులు ఇచ్చారు.
Publish Date:Apr 28, 2025
తెలంగాణ అసెంబ్లీకి 2023లో జరిగిన ఎన్నికలలో పరాజయం పాలై అధికారం కోల్పోయిన తరువాత బీఆర్ఎస్ చరిత్రలో అత్యంత కీలకమైన రాజకీయ సభ ఏదైనా ఉందంటే... అది ఆదివారం వరంగల్ వేదికగా జరిగిన రజతోత్సవ సభ మాత్రమే.
Publish Date:Apr 28, 2025
వేసవి సెలవులు కావడం, ఇంటర్ టెన్త్ పరీక్షా ఫలితాల విడుదల కారణంగా తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. మరీ ముఖ్యంగా వారాంతాలలో అయితే తిరుమల కొండపై ఇసుక వేస్తే రాలనంతగా భక్త జనసందోహం ఉంటోంది.
Publish Date:Apr 27, 2025
తినేమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. సోమవారం (ఏప్రిల్ 28) శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా క్యూలైన్ లోనే అనుమతిస్తున్నారు.
Publish Date:Apr 27, 2025
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పర్యాటక సెక్రటరీ స్మితా సభర్వాల్‌ను ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్మితా సబర్వాల్‌కు బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Publish Date:Apr 27, 2025
మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. అవసరమైతే డైరీల్లో రాసుకోండి అని సూచించారు. పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండాలని.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. అత్యుత్సాహం ప్రదర్శించొద్దని సూచించారు. ఇక నుంచి ఊరుకునే ప్రసక్తే లేదని.. నేను కూడా రేపటినుంచి బయల్దేరుతా ఒక్కొక్కరి సంగతి చూస్తా అని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Publish Date:Apr 27, 2025
సీఎం రేవంత్ రెడ్డితో శాంతి చర్చల కమిటీ నేతలు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి నివాసంలో వారు భేటీ అయ్యారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గా ప్రసాద్, జంపన్న, రవిచందర్ లు విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులపై కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని ముఖ్యమంత్రి ను వారు కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ కు వినతి పత్రం అందజేశారు శాంతి చర్చల కమిటీ నేతలు.
Publish Date:Apr 27, 2025
తెలంగాణ నూతన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె. రామకృష్ణారావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి ఈ నెల 30 పదవీవిరమణ చేయనున్నారు. 1991 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కె.రామకృష్ణారావు ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. రామకృష్ణారావు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Publish Date:Apr 27, 2025
ఏపీ రాజధాని అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటనలో తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, పర్యటన రోడ్ మ్యాప్ పై సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రధాని మోదీ మే 2న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం ఎయిర్‌ఫోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి అమరావతికి చేరుకుని 15 నిమిషాల పాటు రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం 3.45 గంటల నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్ సందర్శిస్తారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
Publish Date:Apr 27, 2025
మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ ఇచ్చిన నోటీసులకు బదులుగా సూపర్ స్టార్ మహేష్ బాబు రాశారు. రేపు సినిమా షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల.. విచారణకు హాజరు కాలేనని ఈడీ అధికారులకు సూపర్ స్టార్ బదులిచ్చారు. సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ప్రమోషన్ కోసం మహేష్ బాబు 5.9 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఇందులో కొంత మొత్తం చెక్కుల రూపంలో, మరికొంత నగదు రూపంలో అందుకున్నారు.
Publish Date:Apr 27, 2025
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్తున్న వాహనాలతో హైదరాబాద్‌లోని ఘట్కేసర్ టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సభకు హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తుండటంతో ఓఆర్ఆర్పై ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకొని.. క్రియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలకు చెందిన వెహికల్స్ భారీగా వచ్చాయి.