Publish Date:Apr 26, 2025
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు నోటీసులు ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టును కోరింది. అందుకు కోర్టు నిరాకరించింది. నూతన న్యాయ చట్ట నిబంధనల ప్రకారం నిందితులను విచారించకుండా ఛార్జిషీట్ తీసుకోలేమని పేర్కొంది. కాగా, మనీలాండరింగ్ కేసు ఛార్జిషీట్లో కాంగ్రెస్ అగ్రనేతలు శామ్ పిట్రోడా, సుమన్ దూబేలను కూడా ఈడీ నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే.సుమారు రూ. 5,000 కోట్ల మేర మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ ఈ చార్జిషీట్‌లో ఆరోపించింది
Publish Date:Apr 26, 2025
అనుచిత వ్యాఖ్యలు, అడ్డగోలు దౌర్జన్యాలు, కిడ్నాప్ లు, బెదరింపులకు పాల్పడిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నదంట. ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, అలాగే నారాలోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు ేసినప్పుడూ, గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి ఉసికొల్పిన సమయంలోనూ.. అదే కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించినప్పుడూ నోరెత్తిని ఆ గొంతు ఇప్పుడు లేస్తోంది.
Publish Date:Apr 26, 2025
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. ముఖ్యంగా తెలంగాణ లోని పలు జిల్లాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో వేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే నిన్న సాయంత్రం పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసినప్పటికీ.. తీవ్ర ఉక్కపొతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గత రెండు వారాలుగా ఎండ తీవ్రతలు అధికంగా ఉండటంతో 30 మంది వరకు వడదెబ్బ కారణంగా మరణించారు. అలాగే మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఎండల తీవ్ర అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు
Publish Date:Apr 26, 2025
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రభుత్వ వ్యతిరేక స్వరం వినిపిస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఆయన ఆశించిన మంత్రి పదవి దక్కలేదనో? ఏమో? ఎప్పటికప్పుడు వివాదాల్లో నిలుస్తూనే ఉన్నారు. సర్కారుని ఇరుకున పెట్టేలా తాజాగా బీఆర్ఎస్ ఎల్కతుర్తి సభ విజయవంతం అవుతుందంటూ దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Publish Date:Apr 26, 2025
ఏపీలోని కూటమి ప్రభుత్వానికి కేంద్రం శుభవార్త చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. ఈ మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో రూ. 1121.20 కోట్ల నిధులు జమయ్యాయి. ఇందులో 70 శాతం గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్‌లకు 20 శాతం, జిల్లా పరిషత్‌లకు 10 శాతం చొప్పున నిధులను కేటాయించనున్నారు.
Publish Date:Apr 26, 2025
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ సాధారణం ఉంది. టోకెన్లు లేని భక్తులకు సుమారు 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి 26 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి ఉంది. శుక్రవారం 64వేల 536 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 30వేల 612మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా భక్తులు 3 కోట్ల 36 లక్షల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు
Publish Date:Apr 26, 2025
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మరొక కీలక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆరవ నిందితుడిగా ఉన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్‌రెడ్డిని శుక్రవారం(ఏప్రిల్ 25) సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు.
Publish Date:Apr 25, 2025
అవినీతి అనగానే రాజకీయ నాయకులే గుర్తొస్తారు. అందులోనూ ప్రభుత్వ భూముల ఆక్రమణ,అంటే రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా అయ్యే పని కాదని అనుకుంటాము, కానీ, అది సంపూర్ణ సత్యం కాదు. రాజకీయ నాయకులలో ఎక్కడో అక్కడ ఒకరో ఇద్దరో నిజాయతీ పరులు ఉన్నట్లుగానే, ప్రభుత్వ అధికారులలోనూ, ప్రభుత్వ భూములను ఇతరత్రా భూమలను అక్రమంగా సొంత చేసుకోగల సమర్ధులు ఉంటారు.ఉన్నారు.అంతే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అవినీతి గ్రాఫ్’ కు పార్లర్’గా అవినీతి అధికారుల గ్రాఫ్’కూడా పెరుగుతోందని’ అధికార వర్గాల్లోనే వినిపిస్తోంది.నిజానికి ఇంటి దొంగను ఈశ్వరుడు అయిన పట్టలేరు అంటారు, కానీ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సార్ల భూదందా, అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూనే వుంది. సంచలనం అవుతోంది.
Publish Date:Apr 25, 2025
పాకిస్థాన్‌ను దెబ్బకొట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్‌లో శాంతి ర్యాలీ జరిగింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులతో పాటు మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ ర్యాలీలో పాల్గొని ఉగ్రవాద చర్యలను ఖండించారు.
Publish Date:Apr 25, 2025
వక్ఫ్ సవరణ చట్టంను సమర్థిస్తూ మోదీ సర్కార్ సుప్రీంకోర్టు లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. వక్ఫ్ (సవరణ) చట్టం-2025 చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లకు సమాధానంగా కేంద్రం కౌంటర్ అఫిడవిట్ వేసింది. ఈ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఈ చట్టంలో చేసిన పలు సవరణలు మత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక హక్కులను హరిస్తాయనే తప్పుడు ప్రాతిపదికపై పిటిషన్లు ఉన్నాయని ఆరోపించింది. ఆర్టికల్ 32 ప్రకారం ఒక చట్టాన్ని సుప్రీంకోర్టు సమీక్షించవచ్చని తెలిపింది.
Publish Date:Apr 25, 2025
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ.. కేంద్ర నిర్ణయానికి కూటమి ప్రభుత్వం మద్దతు ఉంటుందని తెలిపారు. అనంతరం మే 2న అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధానిని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. సుమారు రూ. లక్ష కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు మోదీతో శంకుస్థాపన చేయించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రోడ్‌మ్యాప్ తయారు చేసింది.వెలగపూడి సచివాలయం వెనక అమరావతి పునఃప్రారంభ పనులకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 5 లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. అదే రోజు రోడ్‌షో కూడా ఏర్పాటు చేస్తున్నారు.
Publish Date:Apr 25, 2025
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే పిఠాపురంలో రూ.100 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టిందని తమ ప్రభుత్వం మాట ఇస్తే నెరవేరుస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచుతూ చేపట్టిన నిర్మాణ పనులకు ఆయన నేడు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం 30 పడకలతో ఉన్న ఈ ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతు ప్రధాని మోదీ, సీఎంచంద్రబాబుల నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకు పెంచడం ఈ అభివృద్ధి ప్రస్థానంలో ఒక భాగమని పేర్కొన్నారు. స్వారత్రిక ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన ఉద్ఘాటించారు.
Publish Date:Apr 25, 2025
వేర్వేరు కీలక కేసుల్లో నిందితులుగా ఉన్న ముగ్గురు ప్రముఖులు ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో ఒకే బ్యారక్‌లో ఉన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, మద్యం కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి, ముంబై నటి కాదంబరి జత్మలానీని వేధించిన కేసులో అరెస్టయిన పీఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ జైలులోని ఒకే బ్యారక్‌లో వేర్వేరు సెల్స్‌లో రిమాండ్‌లో ఉన్నారు.