రేవంత్ ను మార్చాలని హైకమాండ్ కు లేఖ! జగ్గారెడ్డి కేసీఆర్ కోవర్టా? 

Publish Date:Dec 28, 2021

Advertisement

తెలంగాణ కాంగ్రెస్ లో  కేసీఆర్ కోవర్టులున్నారా? రేవంత్ రెడ్డి టార్గెట్ గా పావులు కదుపుతున్నారా? ఇదే చర్చ కొన్ని రోజులుగా గాంధీభవన్ తో పాటు రాజకీయ వర్గాల్లో సాగుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లక్ష్యంగా సీనియర్లు గళం విప్పుతుండటం, ఆయన కార్యక్రమాలను బైకాట్ చేస్తుండటంతో తెలంగాణ కాంగ్రెస్ లో ఏదో జరుగుతుందన్న చర్చ  జరుగుతోంది. తాజాగా కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో రేవంత్ రెడ్డి తలపెట్టిన రైతు రచ్చబండతో కాంగ్రెస్ వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఏకంగా హైకమాండ్ కు ఫిర్యాదు చేసే వరకు వెళ్లాయి. 

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  అధిష్టానానికి  రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఏకంగా టీపీసీసీ చీఫ్ ను మార్చాలని కోరారు జగ్గారెడ్డి. పార్టీ బైలాను ఆయన పాటించడం లేదని, సీనియర్ నేతలను కలుపుకోవడం లేదన్నారు. పీసీసీ కమిటీతో చర్చించకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు జగ్గారెడ్డి. అధిష్టానం నాయకత్వాన ఆయన్ను ఎంత కలుపుకొని పోవాలని అనుకుంటున్నా..కుదరడం లేదన్నారు. రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఎక్స్ పోస్ కోసమే పని చేసుకుంటున్నారని, ఏ కార్యక్రమమైనా మీటింగ్ లో చర్చించకుండానే మీడియాని ఇంటికి పిలుపించుకొని ప్రకటన చేస్తున్నారని ఆరోపించారు.ప్రస్తుతానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలా నడుస్తలేదని, ఇది ఒక కార్పొరేట్ పార్టీ ఆఫీస్ గా నడుస్తోందని  తన లేఖలో వెల్లడించారు జగ్గారెడ్డి. ఇందులో ఎదో కుట్ర జరుగుతుందనే అనుమానం వ్యక్తం చేశారాయన. 

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని తప్పించాలంటూ హైకమాండ్ కు జగ్గారెడ్డి లేఖ రాయడం కాంగ్రెస్ లో సంచలనంగా మారింది. నిజానికి మొదటి నుంచి రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు జగ్గారెడ్డి. చాలా సార్లు ఆయనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎర్రవల్లిలో నిర్వహించనున్న రచ్చబండను బాయ్‌కాట్‌ చేశారు జగ్గారెడ్డి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కాంగ్రెస్‌ ఏకైక ఎమ్మెల్యేగా, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న తనకు రచ్చబండ కార్యక్రమంపై సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి అందరిని విడదీసి కార్యక్రమాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.  జగ్గారెడ్డికి పార్టీ సీనియర్‌ నేత వీహెచ్‌ మద్దతు పలికారు. పార్టీ పరంగా జరిగే ఉద్యమానికి కాంగ్రెస్‌ నేతలకు సమాచారం ఇవ్వని టీపీసీసీ చీఫ్‌ చర్యను తప్పుపట్టారు. పీఏసీలో చర్చించకుండా రచ్చబండ కార్యక్రమాన్ని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పార్టీ నాయకత్వం విస్మరించడం ఏంటని ప్రశ్నించారు వీహెచ్‌. 

అయితే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కొందరు సీనియర్లు మాట్లాడటం వెనుక సీఎం కేసీఆర్ వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది. జగ్గారెడ్డితో పాటు మరికొందరు కాంగ్రెస్ సీనియర్లు కేసీఆర్ కు మద్దతుగా ఉన్నారంటున్నారు. వైఎస్సార్ ఆత్మగా చెప్పుకునే ఏపీకి చెందిన సీనియర్ నేత కనుసన్నల్లో వీరంతా పని చేస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల జరిగిన కరీంనగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ కు సపోర్ట్ చేయడం వెనుక ఆత్మ పాత్ర ఉందనే చర్చ సాగింది. ఇక ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఇటీవల గులాబీ లీడర్లతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఇటీవల జరిగిన కేటీఆర్ కార్యక్రమంలో అంతా తానే వ్యవహరించారు జగ్గారెడ్డి. కార్యక్రమం మొత్తం కేటీఆర్ తో గుసగుసలాడుతూ కనిపించారు. కేసీఆర్ పాలనపైనా విమర్శలు పూర్తిగా తగ్గించారు జగ్గారెడ్డి. అధికార పార్టీపై కాకుండా సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేస్తున్నారు. ఇవన్ని గులాబీ బాస్ స్కెచ్ లో భాగంగానే జరుగుతున్నాయని అంటున్నారు. 

జగ్గారెడ్డి గతంలో టీఆర్ఎస్ లో ఉన్నారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో కేసీఆర్ కు షాకిచ్చి హస్తం గూటికి చేరారు. అయితే మంత్రి హరీష్ రావుతో విభేదాల వల్లే జగ్గారెడ్డి కాంగ్రెస్ లో చేరారని చెబుతారు. అప్పటి నుంచి ఆయనకు హరీష్ రావుతో వైరం కొనసాగుతూనే ఉంది. టీఆర్ఎస్ ను కాకుండా ఎక్కువగా హరీష్ రావునే టార్గెట్ చేస్తుంటారు జగ్గారెడ్డి. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ హరీష్ రావుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాని కేసీఆర్, కేటీఆర్ జోలికి మాత్రం వెళ్లలేదు. జగ్గారెడ్డికి హరీష్ రావుపైనే కోపమని, కేసీఆర్ పై సాఫ్ట్ కార్నర్ తో ఉంటారని చెబుతారు. కేటీఆర్ తో ఇటీవల ఆయన సాన్నిహిత్యం పెరిగింది. హరీష్ రావును టార్గెట్ చేయడానికే కేటీఆర్ కు జగ్గారెడ్డి దగ్గరయ్యారనే ప్రచారం కూడా ఉంది. కేటీఆర్ ను కలిశాకే రేవంత్ రెడ్డి పై జగ్గారెడ్డి విమర్శలు ఎక్కువ చేసినట్లు కనిపిస్తోంది. 

రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టేలా కాంగ్రెస్ లోని తన కోవర్టుల ద్వారా కేసీఆర్ కథ నిడిపిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లోనూ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు ఉండేలా కూడా సీనియర్ల బ్యాచ్ పావులు కదుపుతుందని అంటున్నారు. అదే జరిగితే టికెట్ల విషయంలో కేసీఆర్ కొందరికి హామీ ఇస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ పొత్తు కుదరకపోతే మాత్రం టీఆర్ఎస్ లో చేర్చుకుని టికెట్లు ఇచ్చేలా కొందరు కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ అభయం ఇచ్చారని అంటున్నారు. మొత్తంగా రేవంత్ రెడ్డి టార్గెట్ గా కొందరు కాంగ్రెస్ నేతలు మాట్లాడటం వెనుక కేసీఆర్ స్కెచ్ ఉందనే చర్చే రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.