సినిమా స‌రే.. మిగ‌తా స‌మ‌స్య‌ల మాటేంటి జ‌గ‌న‌న్న‌?

Publish Date:Feb 13, 2022

Advertisement

తెలుగు సినీ పరిశ్రమను సీఎం జగన్ విశాఖకు ఆహ్వానించినప్పుడు అమరావతి గుర్తుకు రాలేదా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి. సినిమా టికెట్ల కోసం సమయం కేటాయించిన సీఎం జగన్ రెడ్డి అమరావతి రైతుల కోసం ఎందుకు కేటాయించరంటూ ప్రశ్నలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో సర్వ నాశానం అయిపోయిన రోడ్ల గురించి, యూరియా అందుబాటులో లేక రోడ్డెక్కిన అన్నదాతల కోసం ఎందుకు సమయం కేటాయించరని నిలదీస్తున్నారు. 

సమస్యలను సృష్టించడమే కాకుండా వాటిని మరింతగా జఠిలం చేసి, చివరికి బాధిత వర్గాలు తనను బతిమాలుకునేలా చేసుకోవడం జగన్మోహన్ రెడ్డికి అలవాటైపోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సినీ పరిశ్రమ పెద్దల చేత కూడా బతిమాలించుకుని, చేయెత్తి దండం పెట్టించుకుని మరీ తన ఈగోను సంతృప్తి పరుచుకునే జగన్ ధోరణిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా పెద్దల పరిస్థితే ఇలా ఉంటే ఇక ఏపీలో సామాన్యుడికి దిక్కెవరనే ప్రశ్నలు వస్తున్నాయి.

అడ్డగోలు విభజనతో అన్ని విధాలా నష్టపోయిన ఏపీకి రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు హయాంలో అమరావతి ప్రాంత రైతులు వేలాది ఎకరాల భూమిని త్యాగం చేసిన విషయం తెలిసిందే. రాజధాని అమరావతి నగర నిర్మాణం వేగంగ జరుగుతున్న సమయంలోనే తెలుగుదేశం పార్టీకి ఓటమి అంటగట్టి, ఒక్క చాన్స్ అంటూ అందరినీ కాళ్లా వేళ్లాపడి వేడుకున్న జగన్ రెడ్డికి జనం పట్టం కట్టారు. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే.. ఆ క్రెడిట్ చంద్రబాబుకే వెళ్లిపోతుందనే దురాలోచనతో దాన్ని పక్కన పెట్టేశారు జగన్. ఆపై మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు. దరిమిలా జరిగిందేమిటంటే.. రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు దాటినా రాజధాని ఏదో తెలియని అనిశ్చితిలోనే కొట్టుమిట్టాడుతోంది. ఇదే జగన్ లోని కపట మనస్తతత్వానికి అద్దం పడుతోందంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ ఆ ప్రాంత రైతులు రెండేళ్ళకు పైగా నిరంతరాయంగా, అవిశ్రాంతంగా ఉద్యమిస్తున్నా జగన్ పట్టించుకున్న పాపాన పోలేదు. ఉద్యమిస్తున్న రైతులతో ఒక్కసారి కూడా చర్చించి, సమస్య పరిష్కారం కోసం ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. పైగా ఉద్యమిస్తున్నా అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ అవమానించారు. అనేక మంది రైతులను అరెస్టులు చేయించారు. అడుగడుగునా ఉద్యమాన్ని అణచివేసేందుకు జగన్ రెడ్డి సర్కార్ చేయని ప్రయత్నం లేదు. సభ పెట్టుకోనివ్వలేదు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయనివ్వకుండా అడ్డుకున్నారు. చివరాఖరికి జగన్ తన తాడేపల్లి ప్యాలెస్ నుంచి సచివాలయానికి, అసెంబ్లీకి సెక్యూరిటీ లేకుండా వెళ్లే ధైర్యం కూడా లేదు.

మూడు రాజధానుల బిల్లును కోర్టు మొట్టికాయలు వేయడంతో ఉపసంహరించుకున్న జగన్.. మరింత పకడ్బందీగా మరో బిల్లు తెస్తామని చెప్పడం ఆయనలోని జగమొండి తనానికి నిదర్శనం అంటున్నారు. సినిమా టికెట్ల వ్యవహారంపై సినీ పెద్దలతో ఆగమేఘాల మీద చర్చించడం, సమస్య పరిష్కారం కోసం కమిటి వేయడం లాంటి చర్యలు చేపట్టిన జగన్ అమరావతి రైతుల ఆందోళనపై ఎందుకు స్పందించరంటూ నిలదీస్తున్నారు. 

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.