స్టూడియోల పేరున భూమ్..ధామ్..?

Publish Date:Feb 13, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంచి అడ్మినిస్ట్రేటర్ కాక పోవచ్చును, కానీ, మంచి వ్యాపారవేత్త. ఇది, ఆయన రాజకీయ ప్రత్యర్ధులు సైతం ఆమోదించి తీరవలసిన వాస్తవం. అదే విహయాన్ని ఆయన మరో సారి నిరుపించుకున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్’లో ప్రత్యక్షంగా అధికారంలో లేకుండానే, ఆయన తమ వ్యాపార దక్షతను చూపారు. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి రుజువు చేశారు. ‘క్విట్ ప్రో కో’ తో  కుప్పలు కుప్పలుగ డబ్బులు సంపదించారు. సరే ఆ తర్వాత, ఆయన అక్రమాలకు పాల్పడ్డారని  ఆరోపణలు రావడం,అయన ఓ 16 నెలలు జైలులో ఉండి రావడం అదంతా చరిత్ర. అలాగే, కొన్నికేసులకు సంబంధించి కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ జప్తు చేసిందనుకోండి,అది కూడా వేరే విషయం అనుకోండి. అయితే, ఇప్పటికీ, ఆయన సీబీఐ, ఈడీ దాఖలు చేసిన ఓ పదివరకు చార్జి షీట్లలో ఏ1 ముద్దాయిగా ఉన్నారు. 

ఆదలా ఉంటే, ఇప్పుడు జగన్ రెడ్డి బిజినెస్ యాంగిల్’లో అలోచించి సినిమా ఇండస్ట్రీతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు పథకాలను సిద్దంచేస్తున్నట్లు రాజకీయ,పరిశ్రమ వర్గాల్లో అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు ఎక్కిపు లెక్కలతో మొదలైన సర్కార్, సినీ పరిశ్రమ వర్గాల చర్చలు, చివరకు భూదందాకు చేరాయి. సినిమా పరిశ్రమ, ‘సమస్యలు’ చర్చించేందుకు, మెగా స్టార్ చిరంజీవి బృందంతో జరిపిన చర్చల్లో ముఖ్యమంత్రి, హీరోలకు ‘ల్యాండ్ బిస్కూట్స్’ ఆఫర్ చేశారు. ‘వైజాగ్ వచ్చేయండి, ఇల్లు కట్టుకునేందుకు, స్టూడియోలు పెట్టుకునేందుకు భూములిస్తాను’ అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. 

అటునుంచి వచ్చిన రియాక్షన్ ఏమిటో కానీ, ఇంతలోనే, ప్రభుత్వం చకచక పావులు కదపడం మొదలు పెట్టింది. ముఖ్యమంత్రి నోటి నుంచి సినిమా పరిశ్రమకు భూములు ఇస్తామనే మాట వచ్చిన రెండు రోజుల్లోనే, అదికార యంత్రాంగం భూసేకరణకు సిద్డమై పోయింది. ముఖ్యమత్రి ఒక్క విశాఖపట్నం అంటే, అధికారులు విశాఖతో పాటు తిరుపతి, రాజమహేంద్రవరంలోనూ స్టూడియోలకు భూసేకరణ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ అధికారులు భూములను గుర్తించాలని కింది స్థాయి అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చేసినట్లు, క్రింది స్థాయి అధికార వర్గాల సమాచారం.  
మరో వంక  ‘ల్యాండ్  బూమ్’ క్రియేట్  చేసేందుకు, సినిమా పరిశ్రమను ప్రభుత్వం పావులుగా ఉపయోగించు కుంటోందని, ఇటు సినిమా, అటు రాజీకీయ, వ్యాపార రంగాలు  పండిన పెద్దలు హెచ్చరిస్తున్నారు. మరో వంక ఇప్పటికే, అసైన్డ్ ల్యాండ్స్ సహా ఏదీ వదలకుండా అందుబాటులో ఉన్న భూములను ఎదో ఒక పేరున సేకరించి అమ్మకానికి పెట్టిన ప్రభుత్వం, ఇక ఇప్పుడు స్టూడియోల పేరున  రైతుల భూమలను సేకరించేందుకు రంగం చేస్తోందని అంటున్నారు. ఇప్పటికే  రాజధాని అమరావతి భూములనే అమ్మేందుకు  సిద్దమైన ప్రభుత్వం స్టూడియోల పేరిట సేకరించి రతుల భూములను కూడా అమ్మేస్తుందని రైతులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. స్టూడియోల పేరిట సేకరించిన భూములను స్టూడియోలకు ఇస్తారో లేదో తెలియదు, అలాగే తీసుకున్న వారు స్టూడియోలు కడతారో లేదో కానీ ఆ పేరున భూసేకరణ మాత్రం జరిగి పోతుందని, అంటున్నారు. మొత్తానికి ప్రభుత్వమే పనికట్టుకుని సృష్టించిన,సినిమా టికెట్ల వ్యవహారం, అటు తిరిగి ఇటు తిరిగి తమ భూములకు ఎసరు తెస్తోందని, రైతుల వేదన వ్యక్త పరుస్తున్నారు.
 

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.