కాంగ్రెస్ కొత్త సారథి ఎవరు? రాహుల్ అభీష్టం మేరకే గాంధీ కుటుంబం బయటి వ్యక్తికే పగ్గాలు?

Publish Date:Aug 25, 2022

Advertisement

కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి కొత్త అధ్యక్షుడు కచ్చితంగా గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తినే ఎన్నుకోవడం దాదాపు ఖాయమైపోయిందా అన్న ప్రశ్నకు పరిశీలకులు ఔననే అంటున్నారు. సోనియాగాంధీ ఆరోగ్య సమస్యలతో పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగడానికి సుముఖంగా లేని సంగతి విదితమే. ఇక రాహుల్ గాంధీ అయితే తాను పట్టిన పట్టు విడవబోనని ఖరాఖండీగా తేల్చేశారు.

తాను పార్టీ పగ్గాలు చేబట్టబోననీ విస్పష్టంగా తెలియజేయడంతో పార్టీ ప్రియాంక గాంధీవైపు మొగ్గు చూపినా ఆమె కూడా పార్టీ పగ్గాలు చేపట్టేందుకు నిరాకరించారని చెబుతున్నారు. దీంతో అనివార్యంగా గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి గ్రాండ్ ఓల్డ్ పార్టీకి ఎదురైంది. దీంతో పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎవరన్న చర్చ పార్టీలో విస్తృతంగా సాగుతోంది. పార్టీ అధ్యక్ష పగ్గాలు ఎవరు చేపట్టినా వారు గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడే అయి ఉండాలన్నది బయటకు చెప్పని కండీషన్ గా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

పార్టీలో పాత తరం, కొత్తతరం నేతలను కలుపుకుపోగలిగిన వ్యక్తి... అదే సమయంలో గాంధీ కుటుంబానికి ఆమోదయోగ్యమైన వ్యక్తి కోసం అన్వేషణ ప్రారంభమైందని అంటున్నారు. దీంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రేసులో ఉన్నారంటూ పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. వాటిలో ప్రముఖంగా అశోక్ గెహ్లాట్, అంబికాసోని, మల్లికార్జున్ ఖర్గే, ముకుల్ వాస్నిక్, కేసీవేణుగోపాల్, మీరాకుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ప్రస్తుత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అశోక్ గెహ్లాట్ వైపే మొగ్గు చూపుతున్నారని పార్టీ శ్రేణులు అంటున్నారు. అశోక్ గెహ్లాట్ ను పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తే రాజస్థాన్ సీఎంగా రాహుల్ గాంధీకి సన్నిహితుడైనా రాజేష్ పైలట్ కు అవకాశం దక్కుతుందని, ఇది ఉభయతారకంగా ఉంటుందనీ ఆమె భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటికే  సోనియాగాంధీ ఈ విషయమై అశోక్ గెహ్లాట్ ను ఢిల్లీకి పిలిపించి మాట్లాడినట్లు చెబుతున్నారు. వయోభారం కారణంగా ఆయన కూడా పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు సుముఖంగా లేరని, ఇదే విషయాన్ని ఆయన సోనియాకు చెప్పినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కానీ అసలు విషయమేమిటంటే.. తాను రాజస్థాన్ ను వదిలి వస్తే పైలట్ రాష్ట్ర సీఎం పగ్గాలు చేపడతారనీ, అదే జరిగితే రాష్ట్రంలో తన పట్టు సన్నగిల్లుతుందనీ ఆయన భావిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా అశోక్ గెహ్లాట్ కనుక పార్టీ పగ్గాలు చేపట్టడానికి ఇష్టపడకపోతే రేసులో  అంబికా సోనీ మల్లికార్జున్ ఖర్గే  మీరాకుమార్ కేసీ వేణుగోపాల్ ముకుల్ వాస్నిక్ లలో ఎవరో ఒకరికి ఆ పదవి దక్కే అవకాశం ఉందని పరిశీలకలు అంటున్నారు. వారందరూ కూడా గాంధీ కుటుంబానికి విధేయులేనన్న విషయం తెలిసిందే.

ఏది ఏమైనా ఈ నెల 28న జరగనున్న కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక కమిటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) సమావేశంలో పార్టీ అధ్యక్ష ఎన్నికల తేదీని ఖరారు చేయడమే కాకుండా.. తదుపరి అధ్యక్షుడు ఎవరన్న విషయంలో కూడా పార్టీ కేడర్ కు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సీడబ్ల్యుసీ భేటీలో అధ్యక్ష ఎన్నిక తేదీని ప్రకటించడమే కాకుండా.. తదుపరి అధ్యక్షుడు ఎవరన్న క్లారిటీని కూడా క్యాడర్ కు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.  గాంధీ కుటుంబీకులు కాకుండా మరెవరైనా సరే కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టి పార్టీని నడపడం అంటే వారికి కచ్చితంగా కత్తిమీద సాము వంటిదే. ఆ పదవిలో ఉండి స్వతంత్రంగా వ్యవహరించడం అంత సులువు కాదు. పార్టీ అధ్యక్షుడిగా, ప్రధానిగా సొంత నిర్ణయాలు తీసుకుని దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన పీవీ నరసింహరావుకు.. ఆ తరువాత పార్టీలో జరిగిన మర్యాద ‘తెలిసిందే’ అలాగే సీతారాం కేసరి కూడా. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు పార్టీలో ఎవరూ కూడా పెద్దగా ఆసక్తి చూపడంలేదని అంటున్నారు. అందరూ ముక్త కంఠంతో రాహుల్ గాంధీయే మా నాయకుడు అంటూ చివరి క్షణం వరకూ ఆయనే పార్టీ పగ్గాలు చేపట్టేలా ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. 

By
en-us Political News

  
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.