Publish Date:Jul 24, 2026
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ ) అధినేత్రి మమతా బెనర్జీ కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం (జులై 27) జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు. దీంతో మమత కేంద్రంతో ప్రత్యక్ష పోరాటానికి రెడీ అయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మమత ఢిల్లీ పర్యటన వెనుక విద్యార్థుల ఉద్యమానికి మద్దతు మాత్రమే కాకుండా, బలమైన రాజకీయ వ్యూహాలు కూడా ఉన్నాయంటున్నారు. ఇటీవలి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పరాజయం పాలై అధికారాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత.. ఎంపీ శతాబ్ది రాయ్ సహా ఏకంగా 20 మంది టీఎంసీ ఎంపీలు టీఎంసీని నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలకు సంఘీభావంగా ప్రత్యక్షంగా జంతర్ మంతర్ వద్ద ఆందోళనలో పాల్గొనడానికి మమతా బెనర్జీ హస్తిన వస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
మమతా బెనర్జీ హస్తిన పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పర్యటనలో మమతా బెనర్జీ కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో పాటు ఇతర కీలక ప్రతిపక్ష పార్టీల నేతలతో వరుస భేటీలు నిర్వహించే అవకాశం ఉందన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. జాతీయ స్థాయిలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీతో కలిసి మమత వేస్తున్న ఈ అడుగులు కొత్త రాజకీయసమీకరణాలకు దారితీసు అవకాశం లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Cockroach Janata Party, Jantar Mantar protest, Trinamool Congress TMC, Delhi protest July 27
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mamath-benerjee-delhu-tour-39-227031.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!