Publish Date:Jul 24, 2026
కేంద్ర మంత్రి రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా చేశారు. కేంద్ర రైల్వే, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ ప్రధాని నరేంద్ర మోడీ సూచనల మేరకు, సమర్పించిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం (జులై 24) ఆమోదించారు.
రాజస్థాన్ నుంచి రాజ్యసభ కు ప్రాతినిథ్యం వహించిన రవ్‌నీత్ సింగ్ బిట్టూ రాజ్యసభ పదవీకాలం జూన్ 21తోనే ముగిసింది. ఆ తర్వాత ఆయనకు రాజ్యసభ నామినేషన్ దక్కలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 75(5) ప్రకారం.. పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడైన రవ్‌నీత్ సింగ్ బిట్టూ సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ లో ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికలలో పంజాబ్ నుంచి పోటీ ఓటమి పాలైనప్పటికీ బీజేపీ కేంద్రంలో మంత్రి పదవి కట్టబెట్టింది, రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపింది.
ఇప్పుడు కూడా రవ్ నీత్ సింగ్ చేత మోడీ రాజీనామా చేయించడానికి కారణం ఆయనకు పంజాబ్ బాధ్యతలు అప్పగించడానికేనని రాజకీయవర్గాలలోో చర్చ జరుగుతోంది. పంజాబ్ లో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. పంజాబ్ అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికలలో బీజేపీ విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న కమల దళం.. అక్కడ పార్టీని బలోపేతం చేసే లక్ష్యంగానే వ్యూహాత్మకంగా బిట్టూ చేత రాజీనామా చేయించిందని అంటున్నారు. కేంద్ర మంత్రి పదవిని వీడిన బిట్టూ రాబోయే రోజుల్లో పంజాబ్ లో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని మీడియాకు వెల్లడించారు.
rticle 75 Constitution, BJP Punjab Politics, Beant Singh Grandson
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/union-minister-ravneet-singh-bittu-resigns-39-227033.html
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.