ఎమ్మార్ కేసులో అంతిమలబ్దిదారులు ఎవరు? రూ.45.41కోట్లు చివరికి ఎవరికి చేరాయి?
Publish Date:Aug 3, 2012
Advertisement
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఏడాది క్రితం చేపట్టిన ఎమ్మార్ కేసులో ఇంకా అంతిమలబ్దిదారులు ఎవరో తేలలేదు. అంతే కాకుండా ఈ కేసులో కీలకమైన 45.41 కోట్ల రూపాయలు చివరికి ఎవరికి చేరాయన్నది మిష్టరీగానే మిగిలిపోయింది. దుబాయిలో ఉన్న ఎంజీఎఫ్ సిఇఓ శ్రీకాంత్జోషిని కూడా ఇంకా పట్టుకోవాల్సి ఉంది. అతన్ని అదుపులోకి తీసుకుంటేనే కానీ, కేసు చిక్కుముడి వీడదని సిబిఐ భావిస్తోంది. ప్రధాననిందితుడైన కోనేరు ప్రసాద్ ఆడిటర్ సురేంద్ర ఇచ్చిన వాంగ్మూలం కేసును కొంతవరకూ ముందుకు నడపటానికే దోహదపడిరది. అయితే కేసును ముందుకు నడిపినప్పటికీ సిబిఐకు చిక్కుముడి వీడకపోవటానికి విదేశాల్లో ఉన్న నిందితులే కారణమని తేలుస్తోంది. కోనేరు ప్రసాద్ తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరటంతో సిబిఐ న్యాయస్థానం ఎదుట కేసుపురోగతిని విశదీకరించింది. ఈ కేసులో కీలకమైన మరో 43పత్రాలను సేకరించామని విన్నవించింది. కొత్తగా మరో ఎనిమిది మంది సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేశామని తెలిపింది. విల్లాల అమ్మకాలతో ఆర్జించిన సొమ్మును ఎమ్మార్ సంస్థ, సౌత్ఎండ్ సంస్థకు మళ్లించిందని తెలిపింది. జగన్ సన్నిహితుడు సునీల్రెడ్డికి చెందిన ఈ సౌత్ఎండ్లోకి రూ.36కోట్లు మళ్లించినట్లు తేలిందని సిబిఐ పేర్కొంది. ఈ కేసులో మరో నిందితున్ని విచారించాల్సి ఉందని, ఆ నిందితుడే మొత్తం కేసులో కీలకమైన విల్లాల సొమ్ము పక్కదారి పట్టడానికి కారణమని గుర్తించామని సిబిఐ వివరించింది. అంటే ఈ కేసులో ఇంకా నిందితుల పూర్తిస్థాయి విచారణ పూర్తి కాలేదని న్యాయస్థానం ఎదుట సిబిఐ ఒప్పుకుంది. అది ఎప్పటికి పూర్తవుతుందో మాత్రం వివరించలేదు. అంటే ఈ కేసు ఇంకొన్నేళ్లు కొనసాగుతుందా? అన్న అనుమానాలకు అవకాశం ఇస్తోంది.
http://www.teluguone.com/news/content/who-is-beneficiary-in-emmar-case-24-16193.html





