వైఎస్‌ కాంగ్రెస్‌వాదా? కాదా?

Publish Date:Aug 3, 2012

Advertisement

ఈ ప్రశ్న దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చలకు దారి తీసింది. ప్రత్యేకించి కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ అంశమే చర్చలకు దారి తీస్తోంది. వైఎస్‌కు ప్రచారం చేస్తే కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లుతోందన్న సర్వేల నేపథ్యంలో ఆ పార్టీ వైఎస్‌ చిత్ర పటాలను తొలగించి ఆయన పేరు ఉచ్ఛరించటమే మానేసింది. ఇంతకీ వైఎస్‌ కాంగ్రెస్‌ వాదా? కాదా? అన్న అంశం గురించి ఆయన అభిమానులు పార్టీకార్యాలయాల్లో నేతలను నిలదీస్తూనే ఉన్నారు. దీనికి సమాధానం ఇవ్వకుండా నేతలు తప్పించుకుంటున్నారు. అయితే ఇదే సమస్య హైదరాబాద్‌లోని గాంధీభవన్‌నూ కుదిపేసింది.

 

 

టీకప్పులో తుపానులా అదేంటీ వైఎస్‌ ఫొటో లేకుండా చేశారని వైఎస్‌సలహాదారు కెవిపిరామచంద్రరావు నేతలను నిలదీశారు. దీనిపై కెవిపి పలురకాల వ్యాఖ్యానాలు కూడా చేశారు. దీనికి కాంగ్రెస్‌ సీనియర్‌నేత, రాజ్యసభసభ్యుడు వి.హనుమంతరావు సమాధానమిస్తూ వైఎస్‌ ఫొటో పెట్టినందుకే కార్యకర్తల మనస్సులు క్షోభిస్తున్నాయన్నారు. వైఎస్‌ తనయుడు, వైకాపా అథినేత జగన్మోహనరెడ్డి సోనియాగాంధీని, కాంగ్రెస్‌ పార్టీని ఇష్టం వచ్చినట్లు విమర్శించారన్న విషయమే కెవిపి గమనించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు మా మనస్సులు కూడా బాధపడ్డాయన్నారు. అలానే వైకాపా గౌరవాథ్యక్షురాలు విజయమ్మ ఊరూరా తిరుగుతూ కాంగ్రెస్‌ పార్టీని పలురకాలుగా విమర్శించారని, ఆ విషయంపై కెవిపి ఎందుకు స్పందించలేదని వి.హెచ్‌. ప్రశ్నించారు. వీరిద్దరి మధ్య మాత్రమే కాకుండా పలుప్రాంతాల్లో వైఎస్‌ఫొటో గురించి వివాదాలు జరిగాయి. బతికి ఉన్నంత వరకూ కాంగ్రెస్‌ వాదే అయినా వైఎస్‌ తనయుడు మాత్రం తన సొంతపార్టీకే ఆయన్ని పరిమితం చేశారని కాంగ్రెస్‌ నేతలు దీనికి సమాధానం ఇస్తున్నారు. ప్రజలందరికీ కాంగ్రెస్‌ వాదైన వైఎస్‌ పరిచయమని, ఆయన్ని వైకాపా పార్టీకి షిఫ్ట్‌ చేసిన ఘనత మాత్రం జగన్మోహనరెడ్డిదని గమనించాలని కోరుతున్నారు.

By
en-us Political News

  
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన తాజా సంచలన చిత్రం ఇరుముడి చట్టపరమైన చిక్కుల్లో పడింది.
60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ.!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అవసరానికి ఆదుకుంటుందనే నమ్మకంతో ఓ వ్యక్తి ర్యాపిడో పార్సిల్ సేవలను ఆశ్రయించాడు.
బిగ్ బ్రదర్ ఆఫీసులో రియల్టర్‌కు ప్రత్యేక ఛాంబర్.. ఒక్క బిల్డర్ కోసం వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తారా?
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయక యువతులను లక్ష్యంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్న మరో అక్రమ ఫెర్టిలిటీ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు.  
.గరల్స్ హాస్టల్ ముసుగులో నిర్వహిస్తున్న అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. పక్కాగా అందిన సమాచారంతో హైదరాబాద్ ప్రకాశ్ నగర్ లో అమినీత గరల్స్ హాస్టల్ పై దాడి చేయడంలో అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ గుట్టు రట్లైంది.
పలు ప్రాంతాలలో ఇప్పటికే  రోజూవారీ సరఫరా  నిలిపివేశారు. రోజు విడిచి రోజు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ముందు ముందు ఇది రెండు రోజులు, మూడు రోజులు. వారం రోజులకు కూడా పెరిగే అవకాశం ఉందని జలమండలి అధికారులే ఆఫ్ ది రికార్డ్ చెడుతున్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.