తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎవరు...? టిఆర్ఎస్ అధినేత మదిలో ఈపాటికే ఖరారు!

Publish Date:May 17, 2022

Advertisement

తెలంగాణలో రాజ్యసభ ఎవరిని వరించబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రముఖుల పేర్లు తెరమీదికి వచ్చినా... టిఆర్ఎస్ అధిష్టానం ద‌ృష్టిలో మాత్రం ఈ పాటికే జాబితా సిద్దమైందనే చర్చ జరిగుతుంది. మిగతా వన్నీ వదంతుల షికార్లేనన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. అయితే, రాజకీయ వర్గాల్లోనూ, సాధారణ ప్రజల్లోనూ టిఆర్ఎస్ అధిష్టానం దృష్టిలో మాత్రం ప్రముఖంగా వినిపిస్తున పేర్లు  దామోదర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ రాజ్. అయితే, మరి కొందరి పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. హెటిరో అధినేత పార్థశారథి రెడ్డి, పిఎల్ శ్రీనివాస్ పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఇదిలా ఉండగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం రాజ్యసభకు వెళ్ళడానికన్నా ప్రత్యక్ష ఎన్నికలకే అధికంగా మొగ్గుచూపుతున్నారనేది పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నది. కేవలం రెండేండ్లు ఉండే రాజ్యసభకు వెళ్ళడానికి బదులుగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఐదేండ్లు పదవిలో ఉండటానికే అధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు సమాచారం. ఇటీవల టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటి రామారావుతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశంలో ఇదే విషయం ప్రస్తావనకు వచ్చినట్టు కూడా శ్రీనివాస్ రెడ్డి మద్దతుదారుల అభిప్రాయం. పారిశ్రామిక వర్గాల మద్దతును కూడగట్టడంలో భాగంగా పారిశ్రామిక రంగానికి చెందిన  ప్రముఖ హెటిరో సంస్థ అధినేత పార్థసారథి రెడ్డిని కూడా రాజ్యసభకు పంపించాలనే యోచన గులాబీ బాస్ మదిలో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నది. దీనికి తోడు ఆర్జీఆర్ సిద్దాంతి విద్యాసంస్థల అధినేత పిఎల్ శ్రీనివాస్ కు కూడా అవకాశం ఇవ్వలనేది కూడా ఒక ఆలోచన ఉన్నదనేది సీనియర్లలో మాటల్లో నానుతున్నది. 

గతంలో ఎమ్మెల్సీ, రాజ్యసభకు ఎంపికలు ఎలా ఉన్నా.. ఈ మారు మాత్రం సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకుని రాజ్యసభకు పంపించే వారి జాబితాను టిఆర్ఎస్  అధినేత సిద్దం చేసినట్టు చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వారిని ఒకరికి రాజ్యసభకు అవకాశం కల్పించాలనేది గట్టిగా సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వాల్లోనూ సినీ పరిశ్రమలోని వారికి అడపాదడపా పదవులు వచ్చేవి. ఎందుకంటే టి. సుబ్బరామిరెడ్డి, మురళీమోహన్, రావు గోపపాల రావు, మోహన్ బాబు, శారద, జమున, జయప్రద, రోజా, దాసరి నారాయణరావు, కృ‌ష్టంరాజు, బాబూమోహన్ ఇలా చాలామందే రాజ్యసభకు, ఎమ్మెల్సీగా నియమితులైన సందర్భాలున్నాయి. నేటికీ ఇతర రాష్ట్రాల్లో ఇది కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి కూడా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన వారిని రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ను రాజ్యసభకు పంపిస్తున్నారనేది దాదాపు ఖాయమని ప్రచారం జరుగుతున్నది.  అయితే, టిఆర్ఎస్ ఓటు బ్యాంక్ గా మారుతున్న దళితులు, మైనార్టీలలో దళిత వర్గానికి కూడా ప్రాతినిథ్యం కల్పించాలా..? వద్దా..? అనేది కూడా కెసిఆర్ యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఈ వర్గం నుంచి అవకాశం కల్పిస్తే మాత్రం మాజీ మంత్రి మొత్కుపల్లి నర్సింహులు, లేదా మాజీ ఎంపి మంధా జగన్నాథంకు అవకాశం ఇవ్వచ్చనేది చర్చ జరుగుతోంది. బిసి వర్గాల నుంచి పిఎల్ శ్రీనివాస్ పేరు వినిపిస్తున్నా.. ఈ మారు అవకాశం రాకపోవచ్చనేది తెలుస్తుంది. ఓసి వర్గానికి చెందిన దివకొండ దామోదర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బ్రాహ్మణ కోటాలో సిఎల్ రాజాం, కెప్టెన్ లక్ష్మీకాంతరావు పేర్లు కూడా ఉన్నాయి. అయితే, తుది జాబితాలో మాత్రం దామోదర్ రావు పేరు ఖాయమని తెలుస్తుంది. ఇక శ్రీనివాస్ రెడ్డి పైన కూడా బిజెపిలోకి చేరుతారనే ప్రచారం ఉన్నందున పార్టీ అతడిని నిలువరించేందుకు రాజ్యసభ సీటును కట్టబెడతారనేది బలంగా వినిపిస్తున్నది.

ఇటీవల రాజ్యసభలో తెలంగాణ నుంచి మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. అందులో బండ్ల ప్రకాశ్, డి. శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావులు ఉన్నారు. అయితే, బండ్ల ప్రకాశ్ స్థానాన్ని భర్తీచేసేందుకు  మే 19 నామినేషన్లకు తుదిగడువుగా ఉన్నది. డి శ్రీనివాస్, కెప్టెల్ లక్ష్మీకాంతరావు స్థానాల్ని భర్తీ చేయడానికి మే 31వ తేదీ నామినేషన్లకు ఆఖరు గడువుగా ఉన్నది. ఈ నేపథ్యంలో రాజ్యసభకు బండ్ల ప్రకాశ్ స్థానంలో పంపించే అభ్యర్థి  ఎవరన్నది బుధవారం  ఖరారు కానున్నది. ఇక డి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్థానాల్ని భర్తీ చేసేందుకు మే 31 నామినేషన్లకు చివరితేదీగా ఉంది. మే 30వ తేదీ వరకు వీటికి గడువు ఉన్నందు ముందుగా బండ్ల ప్రకాశ్ స్థానంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ను పంపించే అవకాశాలు లేకపోలేదు. మిగతా రెండింటికి దామోదర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లేదా మరో నేతను పార్టీ అధిష్టానం నిర్ణయించనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేడు అంటే 18వ తేదీన రాజ్యసభకు ఎవరు వెళ్తారనేది తేలే అవకాశాలు లేకపోలేదు.

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా ఎంతో అత్యాధునిక సౌకర్యాలు, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ప్రయాణాలకు మారుపేరుగా నిలిచిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఒక ఘటన కలకలం రేపింది.
ప్యారడైజ్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. కానీ థియేటర్‌లో సినిమా చూసే ఆడియన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ సిద్ధమైంది.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.