జగన్ పాలన అధ్వానం అన్నందుకు దళిత మహిళపై వైసీపీ దాడి!

Publish Date:May 17, 2022

Advertisement

రెండు రెళ్లు నాలుగు అన్నందుకు గూండాలు గుండ్రాళ్లు విసిరే సీమలా తయారైంది వైసీపీ పాలనలో  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం. జగన్ ప్రభుత్వాన్ని, జగన్ పథకాలను విమర్శించినందుకు వైసీపీ శ్రేణులు ఒక మహిళ నివాసంపై సోమవారం అర్ధరాత్రి చేసిన దాడి ఘటన శ్రీశ్రీ చెప్పిన ‘సీమ’ను కళ్లకు కడుతుంది. రాష్ట్రంలో జగన్ పాలన అధ్వానంగా ఉందనీ, ఈ సారి ఎన్నికలలో గెలిచేది చంద్రబాబేనంటూ తన ఎకరంన్న పొలం పందెం కాస్తానన్న మహిళపై సోమవారం అర్ధరాత్రి ఆమె నివాసానికి వెళ్లి దాడి చేశారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్వా పరాలు ఇలా ఉన్నాయి. 

గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన ఎస్సీ మహిళ కె. వెంకాయమ్మకు గ్రామంలో ఉన్న భూమిలో కొంత భాగం ఆక్రమణకు గురైంది. ఆ విషయమై పలు మార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో ఆమె సోమవారం గుంటూరు కలెక్టరేట్ లో స్పందన కార్యక్రమానికి వచ్చి కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన కె వెంకాయమ్మకు గ్రామంలో 4.50 సెంట్లు భూమి ఉంది. దానిలో 3.50 సెంట్లు అదేగ్రామానికి చెందిన కర్ని ప్రకాశం ఆక్రమించుకున్నాడు. తన భూమిని తనకు ఇప్పించాలంటూ అనేకసార్లు స్థానిక అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో గుంటూరు కలెక్టరేట్‌లో స్పందనకు వచ్చి ఫిర్యాదు చేసింది.

ఈ సందర్భంగా ఆమె జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా చంద్రబాబే గెలుస్తాడని ఈ విషయంలో కావాలంటే తన ఎకరంన్నర పొలాన్ని పందె కాస్తాననీ సవాల్ చేసింది. జగన్ పాలనలో ఎవరూ సుఖంగా లేరని చెబుతూ, తనకు విద్యుత్ బిల్లు రూ.18 వేలు వచ్చింద చెబుతూ పెన్షన్ సహా పథకాలన్నీ జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని వెల్లడించింది.  జగన్ ది అసమర్థ పాలన అనీ, అన్న క్యాంటిన్లు రద్దు చేశాడనీ, కోవిడ్ సమయంలో ఆయన అసమర్ధత కారణంగా అనేక మంది మరణించారనీ విమర్శించింది.

జగన్ పథకాలు వద్దే వద్దని, ఆయన పథకాలన్నీ ఓట్ల మీద ప్రేమతోనేనని విమర్శించింది.చంద్రన్న కానుక పేర చంద్రబా బు హయాంలో రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి కానుకలను అందించారనీ, జగన పాలనలో అవేవీ లేవనీ వెంకాయమ్మ విమర్శించింది. దీంతో వైసీసీ శ్రేణులు సోమవారం అర్ధరాత్రి అమె నివాసంపై దాడి చేశాయి.

ఈ దాడిపై మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. తనపై జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తనకూ, తన కుమారుడికీ  ప్రాణ భయం ఉందనీ రక్షణ కల్పించాలని కోరారు. వైసీపీ వారు సోమవారం రాత్రి తనపై దాడి చేసి కొట్టారని అని వెంకాయమ్మ  ఆరోపించారు. కాగా వెంకాయమ్మపై దాడిని తెలుగుదేశం నేతలు తీవ్రంగా ఖండించారు.  

By
en-us Political News

  
హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి.
దేశవ్యాప్తంగా ఎంతో అత్యాధునిక సౌకర్యాలు, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ప్రయాణాలకు మారుపేరుగా నిలిచిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఒక ఘటన కలకలం రేపింది.
ప్యారడైజ్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. కానీ థియేటర్‌లో సినిమా చూసే ఆడియన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ సిద్ధమైంది.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.