కేసీఆర్ సంచలన ప్రకటన ఎప్పుడో?
Publish Date:Jun 10, 2022
Advertisement
తెలంగాణ ముఖ్యమత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్, సంచలన ప్రకటన చేస్తానని ప్రకటించి చాలా రోజులైంది. బెంగుళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామితో జాతీయ రాజకీయాలపై చర్చలు జరిపి హైదరాబాద్ తిరిగొచ్చే సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కుమార స్వామి కూడా ఇంచు మించుగా అలాంటి ప్రకటనే చేశారు. కేసేఆర్ త్వరలోనే ‘సంచలన’ ప్రకటన చేస్తారని చెప్పారు. ఆ సమయంలో కేసీఆర్, చేసే ‘సంచలన’ ప్రకటన రాష్ట్రపతి ఎన్నికలకు సంబందించే ఉంటుందని ఉహాగానాలు వినవచ్చాయి. అయితే, బెంగుళూరు నుంచి వచ్చిన తర్వాత కేసీఆర్, జాతీయ రాజకీయాల గురించి ఎలాంటి ముందడుగు వేయలేదు. అప్పటి నుంచి, ఆయన ఫార్మ్ హౌస్’కే పరిమిత మయ్యారు. ఇంచుమించుగా పక్షం రోజులకు పైగానే కేసీఆర్ ఎక్కడా కనిపించలేదు, వినిపించనూ లేదు. జుబ్లీహిల్స్ మైనర్ బాలిక సామూహిక అత్యాచారం కేసులో అధికార పార్టీ, మిత్ర పక్షం నాయకుల పిల్లలు పాత్రపై రచ్చ జరుగుతున్నా ముఖ్యమంత్రి మాత్రం ఇంతవరకు పెదవి విప్పలేదు. ఒక్క ముఖ్యమంత్రి అనే కాదు, అధికార పార్టీ ముఖ్య నాయకులు ఎవరూ కూడా స్పందించలేదు. ఒక విధంగా ఈ కేసు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. చివరకు ఇలాంటి ‘సంచలన’ సంఘటనల పై ‘సంచలన’ వ్యాఖ్యలు చేసే సినిమా డైరెక్టర్ వర్మకూడా ట్విటర్’ వేదికగా సర్కార్’కు గట్టిగా చురకలు అంటించారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన రావు జోక్యం చేసుకోకపోయుండే, అసలు దోషులు, ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన ముద్దాయి, ‘ఎమ్మెల్యే గారబ్బాయి... తప్పించుకునే వారని వర్మ ట్వీట్ చేశారు. నిజానికి, ఈ కేసు ఎన్ని మలుపులు తిరిగినా, అధికార పార్టీ పై పడిన మచ్చ మాత్రం అలాగే వుంది. నిజానికి, రోజులు గడుస్తున్న కొద్దీ, ఈ కేసులో ప్రధమ ముద్దాయి ప్రభుత్వం అనే అభిప్రాయం మరింతగా బలపడుతోందని, పరిశీలకులు అంటున్నారు. అదలా ఉంటే, జుబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచారం కేసు నేపధ్యంగా, గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్, మహిళా దర్బార్ నిర్వహించారు. ఈ దర్బార్’లో వచ్చియన్ ఫిర్యాదులపై రాష్ట్ర ప్రభుతాన్ని వివరణ కోరతామని ఆమె చెప్పారు.అయితే, రాష్ట్ర ప్రభుతాన్ని వివరణకోరివదిలేస్తే, ఓకే, కానీ, సంవత్సర కాలంగా, రాజభవన్, ప్రగతి మధ్య ప్రత్యక్ష, పరోక్ష యుద్ధం సాగుతున్న నేపధ్యంలో ఆమె అంతటితో అగుతారని అనుకోలేమని, మహిళా దర్బార్’ లో అందుకున్న ఫిర్యాదులను కట్టకట్టి కేంద్రానికి పంపుతారని, అందుకే ముఖ్యమంత్రిలో కదలిక వచ్చిందని అంటున్నారు.
అయితే, రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టిన నేపధ్యంలో కేసీఆర్ ఈరోజు (శుక్రవారం) సాయంత్రం ప్రగతి భవన్’ లో ముఖ్య నేతలతో సమా వేసమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ కీలక సమావేశం’ లో రాష్ట్రపతి ఎన్నిక, జాతీయ రాజకీయాలపై చర్చిస్తారా లేక రాష్ట్రంలో, ‘సంచలనం’ గా మారిన, జూబ్లీహిల్స్ మైనర్ బాలిక, సాముహిక అత్యాచారం కేసు సహా, ఇతర రాజకీయ, పాలనాపరమైన అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారా,అనే విషయంలో స్పష్టత రావాల్సి వుంది.
http://www.teluguone.com/news/content/when-will-kcrs-sensational-comment-comes-25-137432.html





