మినరల్ వాటర్ క్యాన్ లో ఎలుక
Publish Date:Mar 8, 2012
Advertisement
వరంగల్ జిల్లా: వరంగల్ జిల్లా మహబూబాబాద్ పట్టణంలో ఒక వాటర్ ప్లాంట్ సరఫరా చేసిన మినరల్ వాటర్ క్యాన్ లో చనిపోయిన ఎలుక ప్రత్యక్షమైంది. స్థానిక సమైక్య జూనియర్ కళాశాల నిర్వాహకులు సమీపంలోని ఓ కిరాణా దుకాణం నుంచి 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్ తెప్పించారు. మూత తెరిచి చూడగా దానిలో కుళ్ళిపోయిన ఎలుకపిల్ల కనిపించింది. దీంతో కళాశాల నిర్వాహకులు బాటిల్ ను విక్రయించిన దుకాణదారుడితో వాగ్వాదానికి దిగారు. ప్లాంట్ నుంచి తీసుకువచ్చే వాహనాల వారే క్యాన్లు ఇచ్చి పోయారని, తన తప్పేమీ లేదని దుకాణదారు తెలిపారు. దీనిపై మున్సిపల్ అధికారులు విచారణ జరుపుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/warangal-24-12470.html
http://www.teluguone.com/news/content/warangal-24-12470.html
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026





