ఏపీ కర్నాటక మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మ్యాటరేంటంటే?
Publish Date:Oct 3, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల మధ్య జలవివాదాలు ఉన్నాయి. అయితే అవెప్పుడూ ప్రభుత్వాల మధ్య వైరానికీ, మంత్రుల మధ్య ఘర్షణాత్మక పరిస్థితులకూ దారి తయలేదు. ఇటీవల కర్నాటక ప్రభుత్వం అల్మట్టి డ్యాం ఎత్తు పెంచడానికి నిర్ణయం తీసుకుని, అందుకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టేయడానికి రెడీ అయిన సందర్భంగా కూడా ఏపీ నుంచి ఖండనలు అయితే వచ్చాయి కానీ.. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు చెడే పరిస్థితి రాలేదు. అయితే.. తాజాగా కర్నాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. సామాజిక మాధ్యమ వేదికగా రెండు రాష్ట్రాల ఐటీ మంత్రుల మధ్యా జరుగుతున్న మాటల యుద్ధం నెట్టింట వైరల్ అయ్యింది. ఇటీవలి కాలంలో బెంగళూరు ఓఆర్ఆర్ ప్రాంతం నుంచి పలు కంపెనీలు.. ఆంధ్రప్రదేశ్ కు తమ బిచాణా ఎత్తివేసే దిశగా యోచిస్తున్నాయి. అటువంటి కంపెనీలను మంత్రి నారా లోకేష్ ఏపీకి రావాలని ఆహ్వానం పంపడమే కాకుండా, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానం రాష్ట్రంలో అములు అవుతోందంటూ కంపెనీలకు ది బెస్ట్ అనదగ్గ రాయతీలను ఇస్వామని ప్రతిపాదిస్తున్నారు. అంతే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ ప్రపంచ స్థాయి ఏరోస్పేస్, అలాగే ఎకో ఫ్రెడ్లీ వ్యవస్థలన తీసుకువస్తున్నదని చెబుతున్నారు. అయితే లోకేష్ తమ రాష్ట్రంలోని కంపెనీలను ఏపీకి ఆహ్వానాంచడంపై బెంగళూరు ఐటీ మంత్రి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు ఇప్పటికే ఇండియాకు టెక్నికల్ కేపిటల్ గా ఉన్న సంగతిని గుర్తు చేస్తూ.. ఏపీలో పెట్టుబడులు క్షేమదాయకం కాదంటూ ఏపీలో 2019-2024 మధ్య కాలంలో ఆ రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోయాయని చెబుతున్నారు. అంతే కాకుండా ఆయన ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ఈ ప్రతిపాదనలు, ప్రయత్నాలను ఎద్దేవా చేస్తూ ఏపీని పరాన్నజీవిగా అభివర్ణించారు. కర్నాటక ఐటీ మంత్రి ప్రియాంక ఖర్గే మాటలకు లోకేష్ దీటుగా స్పందించారు. ఎక్కడా పరుషమైన పదాలను ఉపయోగించకుండానే.. కర్నాటక మినిస్టర్ కు దిమ్మదిరిగే బదులిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలకు ఆహ్వానం పలుకుతున్న మాట వాస్తవమేననీ, అయితే ఈ ఆహ్వానాలు పోటీ తత్వంతోనో, మరో రాష్ట్రానికి నష్టం చేకూర్చాలన్న ఉద్దేశంతోనో కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్త కొత్త రంగాలలో పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.
http://www.teluguone.com/news/content/war-of-worda-between-lokesh-and-priyank-kharge-39-207251.html





