మాజీ మంత్రి రాంరెడ్డి దామోదరరెడ్డి ఇక లేరు
Publish Date:Oct 1, 2025
Advertisement
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఇక లేరు. ఆయన వయస్సు 73 ఏళ్లు. కిడ్నీల సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన పార్దివ దేహాన్ని రేపు సాయంత్రానికి తుంగతుర్తికి తరలించనున్నారు. శనివారం ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్న రేవంత్ రాంరెడ్డి దామోదరరెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. టీసీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, పొన్న, తుమ్మలలు రాంరెడ్డి దామోదరరెడ్డి మృతి పార్టీకి తీరని లోటని పేర్కొంటూ సంతాపం ప్రకటించారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఆయన నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఒక సారి సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ లో మంత్రిగా పని చేశారు.
http://www.teluguone.com/news/content/former-minister-ramreddy-damodareddy-no-more-39-207226.html





