టికెట్ ను బేరం పెట్టిన గోళ్ళ బాబూరావు ?

Publish Date:Mar 19, 2012

Advertisement

విశాఖజిల్లా పాయకరావు పేట అసెంబ్లీ నియోజకవర్గ తాజా మాజీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోళ్ళ బాబూరావు పార్టీ టిక్కెట్ ను బేరానికి పెట్టినట్టు ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గోళ్ళ బాబూరావు ఉప ఎన్నికల్లో పోటీచేయాల్సి ఉంది. అయితే తనకు బదులుగా తాను సూచించిన వ్యక్తికీ టిక్కెట్ ఇవ్వాలని ఆయన పార్టీ అధిష్టానానికి గతంలో విన్నవించారు. దీంతో ఆయన ప్రత్యర్థులు గోళ్ళ బాబూరావు పై ఆరోపణల వర్షం కురిపించారు. బాబూరావు తన టిక్కెట్ ను రూ. 10 కోట్లకు బేరం పెట్టాడని వారు ప్రచారం చేయడంతో బాబూరావు కంగుతిన్నాడు. దీంతో ఆయన ఈ ఆరోపణలను ఖండిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున తానే పోటీచేస్తానని ప్రకటించుకోవాల్సి వచ్చింది. శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వానికి మద్దతుపలకాలని ముగ్గురు మంత్రులు ఒత్తిడి తీసుకువచ్చి ప్రలోభాలకు గురిచేసినా తాను లొంగలేదన్నారు. తానెప్పుడూ డబ్బులకోసం వెంపర్లాడలేదని స్పష్టం చేశారు.

 

 

By
en-us Political News

  
తెలంగాణ సచివాలయంలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
గ్రేటర్   పరిధిలో బీఆర్ఎస్ కు చెందిన  పలువురు  ఎమ్మెల్యేలు, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి జంప్ చేశారు.  దానం నాగేందర్, వివేకానంద వంటి నేతల ఫిరాయింపులు పార్టీ కేడర్‌లో నిరుత్సాహాన్ని నింపాయి.
పదేళ్లుగా పక్కింటివారిలా పరిచయం.. మెల్లిగా చీటీలతో నమ్మకం సంపాదించారు.. ఆ నమ్మకంతోనే ఒక్కొక్కరి నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఉల్లాస్ పరీక్షకు హాజరవుతున్న లక్షలాది మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు.
పోయింది అధికారం మాత్రమే.. కేసీఆర్‌పై అభిమానం తగ్గలేదు.!
గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి..!
గణేష్‌ నిమజ్జనం సందర్భంగా పోలీసుల బందోబస్తు కొనసాగుతుండగా.. అల్మాస్‌గూడలో అర్ధరాత్రి కొందరు వ్యక్తులు హల్‌చల్‌ చేశారు.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లి సమీపంలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది.
 శ్రీనాథ్  అవయవ దానంతో చావు అంచున ఉన్న ఆరుగురికి  పునర్జన్మ లభించింది. శ్రీనాథ్ కుటుంబ సభ్యులకు జీవన్‌దాన్ అధికారులు   కృతజ్ఞతలు తెలియజేశారు. తన అవయవదానంతో  సిద్దని ప్రేమ వెంకట సత్య సాయి శ్రీనాథ్ మరణించిన తరువాత కూడా చిరంజీవిగా వర్ధిల్లుతున్నాడు.
తాడ్వాయి గురుకుల పాఠశాల విద్యార్థినులు పక్షుల కూతను బట్టి జాతిని గుర్తించే సరికొత్త ఎకో సెన్స్ బర్డ్ సౌండ్ డిటెక్షన్ ప్రాజెక్టును ఆవిష్కరించారు.
తెలంగాణను ఇచ్చిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జనాల సందర్భంగా  ఎస్సై సహా 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 26 మంది గాయపడ్డారు.  రాష్ట్రవ్యాప్తంగా   1.24 లక్షల మండపాల్లో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు తెలంగాణ డీజీపీ  సీవీ ఆనంద్   తెలిపారు.
. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో  తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. సీజన్ చివరి రోజుల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురిసి కొంత మేరకు ఉపశమనం కలిగించాయి గత నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురిసిన  వర్షాల కారణంగా వర్షపాతం లోటు ఒకింత తగ్గింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.