అందుకే జగన్ ఎమ్మెల్యేలపై వేటుకు స్పీకర్ జాప్యం?

Publish Date:Dec 31, 2011

Advertisement

హైదరాబాద్: విప్‌ను ధిక్కరించి, అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శానససభ్యులపై చర్యలు తీసుకునే విషయంలో శానససభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ మరింత జాప్యం చేసే అవకాశాలున్నాయి.స్పీకర్ సాక్షిగానే తాము విప్‌ను ధిక్కరించామని, అందువల్ల విడిగా తాము వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని, తమపై అనర్హత వేటు వేయాలని వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులు అంటున్నారు. అయినా వారిపై అనర్హత వేటు వేసే విషయంలో స్పీకర్ జాప్యం చేస్తూ వస్తున్నారు. తెలంగాణలోని ఆరు శాసనసభా నియోజకవర్గాలకు, వైయస్ జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై వేటు వేస్తే ఖాళీ అయ్యే 17 స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు రాకుండా కాంగ్రెసు పన్నిన వ్యూహంలో భాగంగానే చర్యలపై జాప్యం జరుగుతోందనే విమర్సలు వినిపిస్తున్నాయి. విప్‌ను ధిక్కరించిన శానససభ్యుల వివరణలు తనకు అందాయని, వాటిని పరిశీలిస్తున్నానని స్పీకర్ మనోహర్  చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ తిరుగుబాటు శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి రెండో సారి చేసిన రాజీనామా లేఖ కూడా తనకు అందిందని ఆయన చెప్పారు. జగన్ వర్గానికి చెందిన కాపు రామచంద్రా రెడ్డి మాత్రం మెలిక పెడుతున్నారు. తనకు విప్ అందలేదని, తనకు నోటీసు ఒరిజినల్ ప్రతి కావాలని ఆయన అడుగుతున్నారు. దీంతో కాపు రామచంద్రా రెడ్డికి స్పీకర్ మరోసారి నోటీసు జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

తెలంగాణలోని ఆరు స్థానాలకు, కోవూరు శాసనసభా స్థానానికి ఉప ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో జారీ అయ్యే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ జారీ అయి, ఉప ఎన్నికల ప్రక్రియ సాగుతున్న క్రమంలో వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులపై అనర్హత వేటు వేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. వీటితో పాటు జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుల స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు రాకుండా కాంగ్రెసు జాగ్రత్త పడుతోందని అంటున్నారు.కాగా, వైయస్ జగన్ వర్గానికి చెందిన తమ పార్టీ ఎమ్మెల్సీలపై మండలి చైర్మన్ చక్రపాణికి ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెసు పార్టీ సమాయత్తమవుతోంది. జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, ఎస్పీ రెడ్డి, కొండా మురళి, ప్రభాకర రావులపై జనవరి 2వ తేదీన విప్ శివరామిరెడ్డి చక్రపాణికి ఫిర్యాదు చేయనున్నారు.
 

By
en-us Political News

  
సాయంత్రాలు ఒకింత సేదదీరుదామని పార్కులకు వెడదామనుకునే మధ్య తరగతి వేతన జీవులు, కష్ట జీవులకు ఇక పార్కులలో ప్రవేశం భారంగా మారనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని పార్కులలో ప్రవేశ రుసుము ఇక దాదాపు రెట్టింపు కానుంది.
రాష్ట్రంలో ఆన్‌లైన్ ఫార్మసీ వేదికల ద్వారా జరుగుతున్న మందుల విక్రయాలపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్)  దాడులు నిర్వహించారు.  ఔషధ విక్రయాలకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను  ఉల్లంఘించినట్లు తేలడంతో, ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లతో భాగస్వామ్యం కలిగి ఉన్న మొత్తం 23 మెడికల్ షాపుల లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు. 
ప్రభుత్వ ఉద్యోగం.. అందులోనూ కీలకమైన టౌన్ ప్లానింగ్ అధికారి బాధ్యతలు.
హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ యూనివర్సిటీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
క్రీడా రంగానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా క్రీడలు యువతలో ఉత్సాహాన్ని నింపుతాయని ప్రధాని రేవంత్ తో అన్నట్లు సమాచారం. ప్రధాని మోదీతో జరిగిన ఈ సమావేశం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా  ప్రాధాన్యత సంతరించుకుంది.
అలాగే మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు, సజ్జనార్‌పై  బహిరంగంగా పలు ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారనీ,   పోలీసు యూనిఫాం వెనుక దాక్కున్న నేరస్థుడిగా ఆయన సజ్జనార్ ను అభివర్ణించారనీ తన లేఖలో పేర్కొన్న రాజాసింగ్, అటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న సజ్జనార్ పై చర్యలు తీసుకోకుండా కేవలం బదలీతో సరిపెట్టడమేంటని నిలదీశారు.
అక్వాన్ ప్రభావం ప్రధానంగా తెలంగాణలోని తూర్పు దక్షిణ జిల్లాలపై అధికంగా ఉంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకూ అక్వాన్ ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.  
ఐదు తులాల బంగారం ఆశ.. రెండున్నర తులాల గొలుసు స్వాహా.!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
భారత రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సంపన్నుల ఎదుగుదలపై, ముఖ్యంగా పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ అసాధారణ ప్రగతిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ సంక్షేమ కానుకను అందించేందుకు సిద్ధమైంది.
women cricketer Nandini suicide,BCCI Under 19 cricket, Vikarabad crickete, rFemale cricketer suicide
బీసీ రాజ్యాధికార పాదయాత్రలో తన వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.