వాలంటీరా.. కామాంధుడా! గ్రామ సచివాలయంలో అఘాయిత్యమా..
Publish Date:Nov 6, 2021
Advertisement
ఏపీలో అమలవుతున్న వాలంటీర్ వ్యవస్థను అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్నారు సీఎం జగన్ రెడ్డి. బాపూజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేశామని ప్రచారం చేసుకుంటున్నారు. కాని అసలు సంగతి మాత్రం మరోలా ఉంది. వాలంటీర్ వ్యవస్థ అక్రమాలకు, అరాచకాలకు కేరాఫ్ గా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. జనాలను బెదిరించడం, తమకు నచ్చనివారికి పథకాలు కట్ చేయడం వంటి పనులు చేస్తున్నారు వాలంటీర్లు. అంతేకాదు స్థానిక వైసీపీ నేతల అండతో ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు మహిళలను లైంగింకగా వాడుకుంటున్నారనే ఫిర్యాదులు గతంలో వచ్చాయి.తాజాగా శ్రీకాకుళంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వాలంటీర్ తన రాసలీలకు ఏకంగా గ్రామ సచివాలయాన్నే అడ్డాగా మార్చేసుకున్నాడు. గ్రామ సచివాలయంలోనే బాలిక పై వాలంటీర్ లైంగిక దాడి చేశాడు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వీరఘట్టం మండలం నడుకూరు సచివాలయంలో బొత్స హరిప్రసాద్ వాలంటీరుగా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 31న ఓ బాలికకు మాయ మాటలు చెప్పి సచివాలయంలోకి తీసుకువచ్చాడు. అక్కడే తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న రాంబాబు.. హరిప్రసాద్‌కు సహకరించాడు. అతడు బయటకు వచ్చి తలుపులు మూసి తాళం వేసి బయట ఉన్నాడు. హరిప్రసాద్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలిక అపస్మారస్థితిలోకి వెళ్లిపోయింది. కొద్ది సేపటి తరువాత తేరుకున్న బాలిక ఇంటికి వెళ్లిపోయింది. కొన్ని రోజుల నుంచి బాలిక ప్రవర్తనలో మార్పులు వస్తుంటడంతో తల్లిదండ్రులు బాలికను గట్టిగా నిలదీశారు. దీంతో బాలిక జరిగిన విషయం తెలిపింది. వెంటనే బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు అనుమానితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామ సచివాలయంలో బాలికపై వాలంటీర్ లైంగింక దాడి చేయడంపై జనాలు భగ్గుమంటున్నారు. వాలంటీర్ల అరాచకాలకు చెక్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/village-volunteer-rap-girl-in-sachivalayam-39-125903.html





