ఎగ్జికూటివ్ రాజధానిగా విశాఖ! ఇండియన్ నేవీ వేడుకలపై రచ్చ...
Publish Date:Nov 6, 2021
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదీ.. ఇది ఇప్పుడు ఎవరూ సమాధానం చెప్పలేని ప్రశ్నగా మారింది. 2019 వరకు ఏపీ రాజధాని అనగానే అమరావతి అని వెంటనే జవాబు వచ్చేది. కాని వైసీపీ ప్రభుత్వం వచ్చాకా సీన్ మారిపోయింది. జగన్ రెడ్డి సర్కార్ మూడు రాజధానుల ప్రతిపాదన తేవడంతో అంతా గందరగోళంగా మారింది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు ఇంకా అమోద ముద్ర పడలేదు. కోర్టుల్లో కేసులు ఉండటంతో ఎక్కడిదక్కడే అగిపోయింది. కేంద్ర ప్రభుత్వం కూడా కోర్టు పరిధిలో ఉందంటూ తప్పించుకుంటోంది. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటో ఎవరికి తెలియని పరిస్థితి నెలకొంది. చివరకు గుగూల్ కూడా ఏపీ రాజధాని అంటే హైదరాబాద్ సహా నాలుగు పేర్లు చూపిస్తోంది. ఏపీ రాజధానిపై కేంద్రానికి కూడా క్లారిటీ లేని పరిస్థితి ఉండగా.. తాజాగా ఇండియన్ నేవీ చేపట్టిన ఓ కార్యక్రమం వివాదాస్పమవుతోంది. విశాఖను ఎగ్జికూటివ్ రాజధానిగా ఇండియన్ నేవీ గుర్తించింది. ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సిటీ పేరిట ముంబైలో నావికాదళ యుద్ధనౌక ఐఎస్ఎస్ విశాఖపట్నం త్వరలో ప్రారంభం కానుందని తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్‌సింగ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖను ఎక్జిక్యూటివ్ రాజధానిగా గుర్తించిన తర్వాత యుద్ధ నౌకకు విశాఖపట్నం పేరుతో నామకరణం చేశామని నేవీ అధికారులు చెప్పారు. డిసెంబర్ 4న విశాఖలో జరిగే నేవీ వేడుకలకు రావాలని సీఎం జగన్‌కు నేవీ అధికారులు ఆహ్వానించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలసి ఆహ్వాన పత్రికను అందించారు. రు. అజేంద్ర బహదూర్‌సింగ్‌ను జగన్ సన్మానించి, శ్రీవారి ప్రతిమను అందజేశారు. ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ప్రభుత్వ రాజధాని ప్రతిపాదనకు కేంద్ర ఆమోదం తెలపకుండా.. ఇండియన్ నేవీ ఎలా గుర్తిస్తుందనే ప్రశ్న వస్తోంది. నేవీ తీరుపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/indian-navy-vizag-celebrations-in-dispute-39-125899.html





