విజయవాడ-విశాఖ మధ్య విమాన సర్వీస్ ప్రారంభం ఎప్పటినుంచంటే?
Publish Date:May 5, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రమంత్రి శుభ వార్త చెప్పారు. విశాఖ టు విజయవాడకు విమాన సర్వీసులు పున: ప్రారంభం కానున్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం మధ్య విమాన సర్వీసులు జూన్ 1 నుంచి తిరిగి ప్రారంభించినున్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఇండిగో విమానం విజయవాడలో ఉదయం 7.15 గంటల నుంచి ప్రారంభమై విశాఖకు ఉదయం 8.25 గంటలకు చేరుకుంటుంది. మళ్లీ విశాఖపట్నంలో 8.45 గంటల నుంచి 9.50 విజయవాడకు చేరుకుంటుంది. ఈ మార్గం రాష్ట్ర రవాణా అనుసంధానంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ట్వీట్ చేశారు. వీటికి సంబంధించిన వివరాలను తాజాగా ఆయన వెల్లడించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vijayawada-39-197495.html
http://www.teluguone.com/news/content/vijayawada-39-197495.html
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026





