సింహపురిలో మైనింగ్ పాలిటిక్స్ రచ్చ!

Publish Date:May 5, 2025

Advertisement

మైనింగ్.. మైనింగ్.. మైనింగ్.. నెల్లూరు పాలిటిక్స్ మొత్తం ఈ మైనింగ్ చుట్టే తిరుగుతున్నాయ్. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. రచ్చ మాత్రం   మైనింగ్ చుట్టూనే. నెల్లూరు జిల్లాలో సైదాపురం, గూడూరు, పొదలకూరు మండలాల్లో అనేక మైనింగ్ క్వారీలున్నాయ్. వీటిలో.. కోట్ల విలువైన క్వార్జ్, పల్స్ ఫర్ లాంటి విలువైన ఖనిజాలున్నాయ్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడూ.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా.. ఈ విలువైన ఖనిజాలు అక్రమంగా తరలుతున్నాయని ప్రతిపక్షాలు పోరాటాలు చేస్తున్నాయ్. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఈ పోరాటాలు మాత్రం కామన్‌గా జరుగుతున్నాయ్. కేవలం.. పోరాటం చేసేవాళ్లు మాత్రమే మారుతున్నారనే చర్చ జిల్లాలో జరుగుతోంది. దాంతో.. నెల్లూరు రాజకీయమంతా ఎక్కువగా ఈ అక్రమ మైనింగ్ చుట్టే తిరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయ్. 

గతంలో.. మంత్రులు, మాజీ మంత్రులు వెనకుండి.. ఈ అక్రమ మైనింగ్ దందా నడిపిస్తున్నారంటూ.. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు పోరాటం చేశారు. ఇప్పుడు.. కూటమి అధికారంలోకి వచ్చాక.. వైసీపీ నాయకులు కూడా అదే పోరాటాన్ని భుజాన వేసుకున్నారు. అధికార పార్టీకి చెందిన ఎంపీ వేమిరెడ్డి ఎక్స్‌పోర్ట్ కంపెనీ ద్వారా మాత్రమే.. కొన్ని మైనింగ్ కంపెనీలు సరుకును తరలిస్తున్నాయని.. మిగిలిన మైన్లు తెరవకుండా.. అధికార తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటోందని చెబుతున్నారు. దీని వల్ల.. వేలాది కుటుంబాలు ఉపాధి లేక రోడ్డున పడుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ నేతలు ఈ మాట చెబుతున్నా.. అధికార పార్టీ నేతలు పట్టించుకోలేదన్న చర్చ సాగుతోంది.ఎప్పుడైతే కూటమి సర్కార్ ఏపీలో అధికారంలోకి వచ్చిందో.. అప్పటి నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సైలెంట్ అయిపోయారు. జనాల్లోనే కాదు న్యూస్‌లోనూ ఆయన కనిపించడం తగ్గిపోయింది. కానీ.. ఉన్నట్టుండి ఆయన మళ్లీ మీడియా ముందుకొచ్చారు. సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పెట్టిన కేసులతో పాటు జిల్లాలో జరుగుతున్న మైనింగ్ దందాపైనే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడటం హాట్ డిబేట్‌కు దారితీసింది. అనిల్.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టార్గెట్ గా వ్యాఖ్యలు చేయడం మీద. జిల్లా రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. వేమిరెడ్డికి చెందిన కంపెనీలు మాత్రమే.. సైదాపురం మండలంలో మైన్లు తెరచి.. మైనింగ్ కార్యకలాపాలు కొనసాగించే పరిస్థితి ఉందని ఆరోపించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముసుగుతీసి.. మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడలేదని  నేరుగా చెప్పే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు అనిల్. ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న అనిల్ కుమార్ యాదవ్.. ఒక్కసారిగా ప్రెస్ మీట్ పెట్టి ఇలా ఎంపీని టార్గెట్ చేయడం.. నెల్లూరు పాలిటిక్స్‌ని షేక్ చేసిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.

నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై ఎంపీ వేమిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. అవసరమైతే.. సామాన్య ప్రజల తరఫున పోరాటం కూడా చేస్తామన్నారు. మాజీ మంత్రి కాకాణిపై అక్రమ కేసు పెట్టారని.. కూటమి ప్రభుత్వం వచ్చాక మైనింగ్ మాఫియా అరాచకాలు పెరిగిపోయాయని ఆరోపించడం.. రాజకీయ వర్గాల్లో కాక రేపుతోంది.

గతంలో ప్రభుత్వం విధించిన పెనాల్టీలను కూడా.. ప్రస్తుత ప్రభుత్వం వసూలు చేయాలని డిమాండ్ చేశారు అనిల్ కుమార్ యాదవ్. ఇక్కడే మరో మెలిక పెట్టారు. పెనాల్టీల రూపంలో వసూలు చేసిన డబ్బుని.. అమరావతి నిర్మాణానికి కేటాయించాలని సూచించారు. తమ ప్రభుత్వ హయాంలో.. ఏ మైన్ యజమాని కోర్టులను ఆశ్రయించలేదన్నారు. ప్రస్తుత సర్కార్ విధానాలతో మైన్ ఓనర్లు కోర్టులను ఆశ్రయించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇదంతా ఓకే. అసలు.. అనిల్ కుమార్ యాదవ్ హఠాత్తుగా మీడియా ముందుకు ఎందుకొచ్చారు? ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఇంతలా ఎందుకు టార్గెట్ చేశారనే చర్చే.. జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. అనిల్ చేసిన విమర్శలు, ఆరోపణలకు.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎలా స్పందిస్తారు? ఆయన వర్గీయులు అనిల్‌కు ఎలాంటి కౌంటర్ ఇస్తారు? అనే ఆసక్తితో.. జిల్లా రాజకీయ నేతలంతా ఎదురుచూస్తున్నారు.
కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించి పెట్టే మైనింగ్ దందా కావడంతో.. అందరి అటెన్షన్ ఇప్పుడు ఈ అంశం మీదే ఉంది. గత ప్రభుత్వంలోనూ అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వచ్చి.. ఇప్పుడు కూడా అక్రమాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలతో.. ఎప్పుడూ ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెట్టడం.. సామాన్య జనాల్లోనూ ఆసక్తి రేపుతోంది. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ఈ మైనింగ్ పాలిటిక్స్.. మొత్తం ఆంధ్రా పాలిటిక్స్‌నే ఆకర్షిస్తున్నాయ్. ఇంకొందరు బడా లీడర్లు కూడా మైనింగ్ దందా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో పడ్డారనే టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా.. స్తబ్దుగా ఉన్న మైనింగ్ అంశం.. అనిల్ కుమార్ యాదవ్ ఎంట్రీతో.. ఒక్కసారిగా హీటెక్కింది. దీనికి.. అధికార పార్టీ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందనేది.. జిల్లా రాజకీయాల్లో ఇంట్రస్టింగ్‌గా మారింది.

By
en-us Political News

  
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.