భవానీ ఐలాండ్ కాంట్రాక్ట్ లో లగడపాటికి వాటా?

Publish Date:Mar 7, 2012

Advertisement

విజయవాడ: విజయవాడ సమీపంలోని భవానీ ఐలాండ్ ప్రైవేటీకరణ అంశం ఇప్పటికే తీవ్ర వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిని మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష కంపెనీకి కట్టబెట్టేందుకు ప్రయత్నించింది. దీనిపై నగరంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిత్యం జరుగుతున్నాయి. అయితే ఈ ప్రైవేటీకరణ వెనుక విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ హస్తం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ప్రత్యూష కంపెనీలో రాజగోపాల్ బినామీ పేర్లతో పెట్టుబడులు పెట్టి ఈ ఐలాండ్ ను హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఆయన భవానీ ఐలాండ్ ప్రైవేటీకరణను వ్యతిరేకించడం లేదు. అంతేకాక భవానీ ఐలాండ్ ప్రైవేట్ పరం కాకుండా ఆపటం ఎవరితరం కాదు అని ఓపెన్ గానే స్టేట్ మెంట్ ఇచ్చారు. టిడిపి నేత వల్లభనేని వంశీ ఇటీవల నగరంలో రాజగోపాల్ ఫోటోతో వేలాది వాల్ పోస్టర్లు వేయించారు. భవానీ ఐలాండ్ ఆయన వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని ఆ వాల్ పోస్టర్ లో కోరారు. దీనికి కూడా రాజగోపాల్  స్పందించలేదు. నిజానికి భవానీ ఐలాండ్ లో టూరిజం శాఖ నిర్వహిస్తున్న రిసార్ట్స్ లాభాలబాటలో ఉంది. గత ఏడాది ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు రూ.60 లక్షలు లాభాలు వచ్చాయి. అయినా నష్టాలు వస్తున్నాయనే సాకుతో దాన్ని గంతాకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నానికి ఎంపితో సహా కాంగ్రెస్ నాయకులెవరూ ఏమాత్రం అభ్యంతరం చెప్పక పోవడం మరో విశేషం. నిజానికి ఎంపి రాజగోపాల్ తలచుకుంటే ఈ కాంట్రాక్టును రద్దు చేయించడం పెద్ద పనేమీ కాదు. కానీ ఆయనకే ఈ కాంట్రాక్టులో వాటాలు ఉన్నందువల్లే ఆయన ప్రైవేటీకరణను సమర్ధిస్తున్నారన్న అపవాదును మూటగట్టుకున్నారు.

By
en-us Political News

  
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో  దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.   
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది. 
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.