2014 ఎన్నికల్లో పోటీకి బాలయ్య సై!

Publish Date:Jan 7, 2012

Advertisement

విజయవాడ: ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు సై అన్నారు. 2014 ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నానని యువరత్న బాలకృష్ణ చెప్పారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయాన్ని పార్టీ నిర్ణయానికే వదిలేస్తున్నట్లు చెప్పారు. కోస్తా, రాయలసీమ, తెలంగాణాలో ఎక్కడ నుంచైనా పోటీ చేస్తానని, అదే సమయంలో పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతలను కూడా చేపడతానని తెలిపారు. కృష్ణా జిల్లా ఘంటసాలలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కోసం శనివారం ఆయన విజయవాడ వచ్చారు. పార్టీ దివంగతన నాయకుడు చలసాని వెంకటేశ్వరరావు (పండు) కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇంతవరకూ కేవలం పార్టీ ప్రచారాలకే పరిమితమయ్యాననీ ఇక నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో పాలుపంచుకోవాలనుకుంటున్నాని చెప్పుకొచ్చారు. తమ కుటుంబం నుంచి ఎవరైనా రాజకీయాలలోకి రావచ్చునని, ఇందులో ఒత్తిడి ఏమీ లేదని ఆయన చెప్పారు. మరో నాలుగేళ్లలో తన కుమారుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం చేస్తాడని అన్నారు. తను మాత్రం ప్రజాసేవకు అంకితమవ్వాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. టీడీపీ ఒక్కటే కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయమని, ప్రజలు కూడా మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ విషయంలో పార్టీ వైఖరే తన వైఖరని చెప్పారు. ప్రజలు ఎలా కోరుకుంటే అలాగే పార్టీ నడుచుకుంటుందన్నారు. అంతకు ముందు బాలకృష్ణ గన్నవరం విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీగా విజయవాడ చేరుకున్నారు. నేరుగా చలసాని పండు ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాలకృష్ణ వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), విజయవాడ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్, మాజీ ఎంపీ గద్దే రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

By
en-us Political News

  
ఐదు తులాల బంగారం ఆశ.. రెండున్నర తులాల గొలుసు స్వాహా.!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
భారత రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సంపన్నుల ఎదుగుదలపై, ముఖ్యంగా పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ అసాధారణ ప్రగతిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ సంక్షేమ కానుకను అందించేందుకు సిద్ధమైంది.
women cricketer Nandini suicide,BCCI Under 19 cricket, Vikarabad crickete, rFemale cricketer suicide
బీసీ రాజ్యాధికార పాదయాత్రలో తన వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
అక్రమ రవాణా ముఠాలకు సింహస్వప్నం.. వేలాది మంది బాధితులకు విముక్తి.. 2 వేల మందికి పైగా సివిల్ సర్వెంట్లకు మార్గదర్శకత్వం.
రాష్ట్రంలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే అంశాలపై ప్రముఖులు స్పందిస్తుండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఇటీవలి కాలంలో ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో తగిన భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్వహించిన దాండియా వేడుకలో దురదృష్టవశాత్తు ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. అలాగే ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా సినిమా ప్రమోషన్ ఈవెంట్  నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.  
కూల్‌డ్రింక్‌లో విషం కలిపి 10వ తరగతి విద్యార్థి హత్య.!
అత్యవసర అవసరాల నిమిత్తం శ్రీను ఒక మొబైల్ లోన్ అప్లికేషన్ ద్వారా  40 వేల రూపాయలు రుణం తీసుకున్నాడు. అయితే అనుకోని ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో లోన్ యాప్ రికవరీ ఏజెంట్ల నుంచి శ్రీనుకు   వేధింపులు ప్రారంభమయ్యాయి.
275 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు...మంత్రి శ్రీధర్ బాబు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.