శాంతి తో రిలేషన్ బయట పెట్టిన విజయసాయి
Publish Date:Jul 20, 2024
Advertisement
దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి తో తనకున్న రిలేషన్ గూర్చి వైకాపా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా విజయసాయి, శాంతితో అక్రమ సంబంధం గూర్చి చర్చ జరుగుతుంది. శాంతి కొడుకుకు విజయసాయి తండ్రి అని చెప్పిన శాంతి భర్త మదన్ మోహన్ నిన్న రాష్ట్ర హోంమంత్రి అనితను కల్సి డిఎన్ఏ టెస్ట్ చేయాలని కోరారు. గిరిజన చట్టాల ప్రకారం శాంతి ఇంకా తన భార్య అని, ఇంకా విడాకులు కూడా మంజూరు కాలేదని ఆయన వివరణ ఇచ్చారు. డిఎన్ ఏ పరీక్ష విజయసాయిరెడ్డి, సుభాష్ రెడ్డిలకు చేయాలని మదన్ మోహన్ కోరుతున్నారు. డిఎన్ ఏలో తాను తండ్రి కాదని తేలితే చట్టబద్దంగా విడాకులు కూడా ఇస్తానన్నారు. లీగల్ గా భర్త అయిన తనకు ఫ్యూచర్ లో ఇబ్బందులు ఉండకూడగన్న ఉద్దేశ్యంతో డిఎన్ ఏ టెస్ట్ అడుగుతున్నట్లు చెప్పారు. మదన్ మోహన్ పదే పదే డిఎన్ ఏ టెస్ట్ అడుగుతున్నప్పటికీ శాంతి మాత్రం డిఎన్ ఏ అవసరం లేదంటూ పట్టుబడుతున్నారు. అడ్వకేట్ సుభాష్ రెడ్డి ద్వారా బిడ్డను కన్నట్లు శాంతి అంగీకరించింది. మదన్ మోహన్ తనపై చేస్తున్న ఆరోపణల గూర్చి విజయసాయి మొదటిసారి స్పందించారు. వైజాగ్ సీతమ్మధారలో మొదటి సారి శాంతితో భేటీ అయినట్లు ఆయన చెప్పారు. దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ఉన్నశాంతిని 2020లో కలిసినట్లు విజయసాయి చెప్పుకొచ్చారు. శాంతిని బిడ్డ మాదిరిగా చూసుకున్నాను. శాంతికి బిడ్డ పుడితే ఇంటికి వెళ్లి పరామర్శించాను. తన బిడ్డతో కల్సి తాడేపల్లి గూడెంకు వస్తే శాంతిని బిడ్డ మాదిరిగా చూసుకున్నానని విజయసాయి చెప్పుకొచ్చారు. కొన్ని టీవీ చానళ్లు మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని వక్రీకరించి ప్రసారం చేస్తున్నాయని విజయసాయి అంటున్నారు. ఇంత జరుగుతున్నా సుభాష్ రెడ్డి స్పందించకపోవడంతో వివాదం మరింత ముదురుతుంది. శాంతి బిడ్డకు తండ్రి సుభాష్ రెడ్డి ప్రూవ్ కాకపోతే వియసాయి తండ్రి అని కన్ఫర్మ్ అవుతుంది. ఈ కారణంగా విజయసాయి ఆదేశం మేరకు సుభాష్ రెడ్డి అండర్ గ్రౌండ్ లో వెళ్లినట్లు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/vijayasai-revealed-the-relationship-with-shanti-25-181113.html





