ఆంధ్రప్రదేశ్ లో వైసీసీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ, అంతకు ముందు విపక్షంలో ఉండగా మూడున్నరేళ్లూ బీజేపీ ఆ పార్టీకి అన్ని విధాలుగా అండదండగా నిలిచింది. వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసుల విచారణ వేగం పుజుకోకపోవడం నుంచి, అధకారంలో ఉండగా జగన్ ఆర్థిక అరాచకత్వానికి ప్రోత్సాహం ఇవ్వడం నుంచీ బీజేపీ వైసీపీకి, జగన్ కు వెన్నుదన్నుగా నిలిచింది. ఇవి ఆరోపణలకు మాత్రమే కాదు.. అక్షర సత్యాలంటూ పరిశీలకులు బోలెడు ఉదాహరణలు చూపుతున్నారు. జగన్ హయాంలో ప్రభుత్వం అడ్డగోలు అప్పులు చేసిందంటే అందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ అత్యంత ఉదారంగా వ్యవహరించడమే కారణమనడంలో సందేహం లేదు. అంతకు ముందు వైసీపీ విపక్షంలో ఉన్న సమయంలో కూడా అప్పటికి అధికారంలో ఉన్న మిత్రపక్షమైన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టిన మోడీ సర్కార్ విపక్షంగా వైసీపీ ఏపీలో బలపడటానికి తన వంతు సహకారం అందించారు.
అయిదేళ్ల జగన్ పాలన కారణంగా బీజేపీకి ఇంకా ఆ పార్టీకి వంత పాడితే మొదటికే మోసం వస్తుందన్న భయంతో వైసీపీకి తెగదెంపులు తెచ్చి తెలుగుదేశం, జనసేనలతో పొత్తు పెట్టుకుంది. ఆ పొత్తు వల్ల ఏపీలో రాజకీయంగా బీజేపీ లబ్ధి పొందింది. అంతే కాకుండా కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి తెలుగుదేశం రూపంలో బలమైన అండ కూడా లభించింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వ మనుగడ ఇప్పుడు తెలుగుదేశం మద్దతుపైనే ఆధారపడి ఉంది. అయినా కూడా బీజేపీకి వైసీపీతో అనుబంధం వదులుకోవడానికి మనసు రావడం లేదా? అంటే జరుగుతున్న పరిణామాలను, ఆ పార్టీ ఎంపీతో అమిత్ షా భేటీని, ఆ భేటీ జరిగిన సమయాన్ని బట్టి చూస్తే ఔననే సమాధానమే వస్తుంది.
తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆయనతో భేటీ అయిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. విజయసాయి అమిత్ షా భేటీ అయిన సమయాన్ని బట్టి చూస్తుంటే... వైసీపీ అధినేతను ఆదుకోవడానికి, ఆయనను ఆపదలలోంచి బయటపడేయడానికి బీజేపీ ఇంకా తహతహలాడుతోందని భావించవలసి వస్తోంది. ఎందుకంటే ఇటీవలే అమెరికాలో అదానీపై కేసు నమోదైంది. ఆ కేసులో జగన్ పేరు, ప్రస్తావన ఉంది. సరిగ్గా ఈ తరుణంలో విజయసాయి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం అనుమానాలకు తావిస్తోంది. జగన్ ను ఈ కేసు నుంచి బయటపడేసేందుకు ఆయన దూతగా విజయసాయి అమిత్ షాను కలిశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పైగా ఈ భేటీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హస్తిన పర్యటన జరిగిన వెంటనే ఉండటంతో తెరవెనుక ఏదైనా జరుగుతోందా అన్న అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. అదానీ, జనగ్ అమెరికా కేసు విషయంలో పవన్ కల్యాణ్ మాట్లాడకపోవడంతో బీజేపీ ఈ విషయంలో జగన్ కు సహకారం అందిస్తున్నదా? అందుకే పవన్ కల్యాణ్ ను అమెరికా కేసు గురించి మాట్లాడవద్దని సూచించిందా అన్న చర్చ రాజకీయ వర్గాలలో మొదలైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vijayasai-meet-amitshah-39-189433.html
జగన్ అధికారం కోల్పోయిన తరువాత ఆయన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో జగన్ మోహన్ రెడ్డి పార్టీ చిత్తుచిత్తుగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. దీంతో అప్పటి వరకూ నత్తనడకన నడిచిన వివేకా హత్య కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ కేసుకు సంబంధించి కడప జిల్లా పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ తాజాగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బంధువులు సహా పలువురికి నోటీసులు జారీ చేశారు.
రాజకీయాల్లో తనను తానో పెదరాయుడిగా ఊహించుకున్న జగన్.. పార్టీ నిర్వహణ నుంచి ముఖ్యమంత్రిగా పాలన సాగించడం వరకూ, పరాజయం తరువాత ఈవీఎంలపై నెపం నెట్టేసి, అధికారం కోల్పోయిన మరుసటి రోజు నుంచే రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వానంగా మారిపోయాయంటూ గగ్గోలు పెట్టడం వరకూ అన్నీ కూడా అదే తరహాలో చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలోనే శాశ్వత నివాసం ఏర్పరుచుకోవాలని భావిస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలంగా ఉండవల్లి గ్రామంలోని లింగమనేని గెస్ట్‌హౌస్‌లో నివాసం ఉంటున్న ఆయన పలు సందర్భాలలో అమరావతిలో తన సొంత ఇంటిని నిర్మించుకుంటానని వెల్లడించారు.
అధికారం అండతో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయిన వారందరికీ ఇప్పుడు కర్మ ఫలం అనుభవించకతప్పని పరిస్థితి ఎదురౌతోంది. జగన్ హయాంలో దౌర్జన్యాలు, దుర్మార్గాలు, బెదరింపులకు సంబంధించి ఇప్పుడు మరో విషయం వెలుగులోకి వచ్చింది. కాకినాడపోర్టు, కాకినాడ సెజ్ లలో బలవంతంగా షేర్లు లాక్కొని చేసిన దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ పై సస్పెన్షన్ వేటు పడింది. వైసీపీ హయాంలో సీఐడీ చీఫ్ గా సంజయ్ జగన్ సర్కార్ మెప్పు కోసం నిబంధనలకు తిలోదకాలిచ్చి ఇష్టారీతిగా వ్యవహరించారు. జగన్ కనుసన్నలలో ఆయన ఆడమన్నట్లల్లా ఆడి, పాడమన్నట్లల్లా పాడారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. సంజయ్ హయాంలో ఆంధ్రప్రదేశ్ సీఐడీ వైసీపీ ప్రైవేటు సైన్యంలా పని చేసింది.
తిరుమల ప్రసాదం విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన, పవిత్రమైన లడ్డూ ప్రసాదం విషయంలో నియంత్రణ ఎత్తివేసింది. భక్తులకు కోరినన్ని లడ్డూలను ఇవ్వాలని నిర్ణయించింది.
తెలుగు రాష్ట్రాలలో బుధవారం (డిసెంబర్ 4) భూమి కంపించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో పలు ప్రాంతాలలో ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. ఈ భూప్రకంపనలు కనీసం రెండు నుంచి మూడు సెకండ్లు సంభవించినట్లు సమాచారం.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (డిసెంబర్ 4) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఒక కంపార్ట్ మెంట్ లో వేచి ఉన్నారు.
ఇబ్రహీం పట్నం మండలం రాయపోలులో కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడైన పరమేష్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. కులాంతర వివాహం, ఆస్తి తగాదా కారణంగా నాగమణిని ఆమె తమ్ముడు పరమేష్ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిని ఉక్కుపాదంతో అణచివేయాలని యోచిస్తున్నారు
భక్తి దేవుడిపై కాదు.. ప్రసాదం మీద అన్నట్లుగా ఆర్. కృష్ణయ్య తీరు ఉంటుంది. బీసీలకు తానే నాయకుడినని చెప్పుకుంటూ ఆ పేరుతో అధికారంలో ఉన్న పార్టీల పంచన చేరి బడా పదవులు కట్టేస్తుంటారు.
ఆగ్రాలోని తాజ్ మహల్ పేల్చేస్తామని ఉత్తర ప్రదేశ్ పర్యాటశాఖకు మంగళవారం ఈ మెయిల్ వచ్చింది. దీంతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.