భోపాల్ గ్యాస్ ట్రాజిడీకి నాలుగు దశాబ్దాలు.. నేర్చుకున్న పాఠాలేంటి?
Publish Date:Dec 4, 2024
Advertisement
భోపాల్ గ్యాస్ ట్రాజిడీకి నాలుగు దశాబ్దాలు పూర్తయ్యింది. ఆ విషాదం నుంచి ప్రభుత్వాలు గుణపాఠాలు నేర్చుకున్న దాఖలాలు ఇసుమంతైనా కనిపించడం లేదు. స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో విదేశీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా వాటికి రెడ్ కార్పెట్ పరుస్తు.. పర్యావరణం, ప్రజారోగ్యం విషయంలో జాగ్రత్తలకు తిలోదకాలిచ్చేస్తున్నాయి. ముఖ్యంగా ఏమైనా విపత్తులు సంభవిస్తే సదరు కంపెనీలే పూర్తి బాధ్యత వహించాలన్న దిశగా ఇప్పటికీ చట్టాలు లేకపోవడం దారుణం. 1884 డిసెంబర్ 3వ భోపాల్లో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి మిథైల్ ఐసోసనియేట్ వాయువు లీకైంది. ఒక్కసారిగా నిద్రలో ఉన్న చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఉలిక్కి పడ్డారు. నిద్రలోనే ఈ విషవాయువు ను పీల్చడంతో కళ్లు విపరీతంగా మండడంతో ఇళ్లు నుంచి బయటకు వచ్చారు.ఊపిరి తిత్తులలోకి ఈ వాయువు వెళ్ళడంతో ఆస్పత్రులకు పరిగెత్తారు. మధ్యలోనే రోడ్లపై ప్రాణాలు వదిలారు. తెల్లవారేసరికి నగరంలో ఎక్కడ చూసినా శవాల గుట్టలే కనిపించాయి. విషవాయువు పీల్చి మరణించిన వారి సంఖ్య పాతిక వేలకు పైనే ఉంటుదన్నది ఒక అంచనా, మృతులే కాకుండా మరో ఆరు లక్షల మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికీ వారిని ఆ పీడ వదలలేదు. అప్పుడు గర్భవతులు గా ఉన్న తల్లులు కన్న పిల్లలు ఇప్పటికీ అంతుపట్టని వ్యాధులతో బాధపడుతున్నారు. వారి తరువాత తరాల వారు కూడా అనేక రోగాలతో బాధపడుతునే ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులకు న్యాయం చేయడంలో విఫలమయ్యాయి. ఆ కర్మాగారం మూతపడినా చుట్టుపక్కల ప్రాంతాలు ఇప్పటికీ కాలుష్యాన్ని వెదజల్లుతూనే ఉన్నాయి. నిజానికి మిథైల్ ఐసోసనియేట్ వాయువు సైనేడ్ అంత ప్రమాదమని అనంతర పరిశోధనలలో తేలింది.ఈ ప్రమాదం అనంతరం జన్మించిన అనేక మంది పిల్లలు వికలాంగులుగా పుట్టారు.శిశు మరణాల రేటు భోపాల్ లో ఇప్పటికీ అధికంగానే ఉంది. మూడు తరాలు మారినా అనారోగ్య సమస్యలు వెంటాడుతునే ఉన్నాయి.నేటికీ న్యాయంకోసం ప్రధాని మోడీకి కన్నీళ్లతో విజ్ఞాపనలు పంపేవారు ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. ఒక్క కంపెనీ నిర్లక్షమే ఇంతటి వినాశనం సృష్టిస్తే భారత్ కు కుప్పలుతెప్పలుగా వస్తున్న కంపెనీలు ఎంతవరకూ క్షేమదాయకమో ఊహించలేం.ఉన్న స్వదేశీ కంపెనీలే విషాన్ని కక్కుతుంటే కాలుష్య నియంత్రణ అధికారులు మీన వేషాలు లెక్కిస్తున్నారు. ఇప్పటికీ మందుల తయారీ కంపెనీలు హైదరాబాద్ లాంటి నగరాల్లో నిషిద్ధ వాయువులను గాలిలోకి వదులుతున్నాయి. అయినా అటు ప్రజలు,ఇటు ప్రభుత్వాలకు చీమకుట్టినట్లు లేదు.అదే విదేశీ కంపెనీల విషయంలో కఠినంగా ఉంటారా అనేది అనుమానమే. అలాంటి పరిస్థితి రాకుండా కాలుష్య నియంత్రణపై తగిన చర్యలు చేపట్టేలా అధికారులు,ప్రభుత్వాలు తగిన ఒప్పందాలు చేసుకునేలా చట్టాలు రావలసిన అవసరం ఉంది.
అత్యంత దారుణమేమంటే ప్రమాదం జరిగిన వెంటనే 6వతేదీ అమెరికా నుంచి ఆ కంపెనీ చైర్మన్ వారెన్ అండర్సన్ భోపాల్ వచ్చారు.ఆయనను పోలీసులు అరెస్టు చేసి కంపెనీ అతిధి గృహంలో బంధించారు. కేవలం మూడు వేల మంది చనిపోయారని,1.2లక్షల మంది అస్వస్థతకు గురైనారని అంచనా వేసి1989లో నష్టం పరిహారం 47కోట్ల డాలర్లతో భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అప్పటివరకూ ఈ గ్యాస్ వల్ల వచ్చే దుష్పరిణామాలు కంపెనీ సరిగా వెల్లడించలేదు. అ అండర్సన్ వెంటనే స్వదేశానికి తిరిగి వెళ్లేలా అమెరికా ప్రభుత్వం అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీపై ఒత్తిడి తీసుకువచింది. దీంతో కేవలం నామమాత్రపు పూచికత్తుపై బెయిల్ తీసుకుని అండర్సన్ విమానంలో అమెరికా వెళ్లిపోయాడు.పరిహారం నామమాత్రమే పుట్టడంతో బాధితులు కోర్టులు,అంతర్జాతీయ సంస్థలు చుట్టూ తిరిగినా ప్రయోజనం కలగలేదు. అండర్సన్ భారత్ వైపు తిరిగి చూడలేదు. కంపెనీ నష్టపరిహారం ఒప్పందం మించి ఒక్క రూపాయి ఇవ్వలేదు.
http://www.teluguone.com/news/content/four-decades-for-bhopal-gas-tragedy-39-189428.html