విజయానికి దిగజారుడు మెట్లు..!

Publish Date:Sep 4, 2012

Advertisement

అతి తక్కువ కాలంలో అందనంత ఎత్తుకు ఎదిగిన ఓ మహావ్యక్తికి ఓ ప్రముఖ రచయిత పిచ్చ ఫ్యాన్. తను మంచి బూమ్ లో ఉన్న రోజుల్లో అభిమాన నక్షత్రాన్ని తలుచుకుని పొంగిపోతూ విజయం సాధించడానికి ఎన్ని మెట్లు ఎలా ఎక్కిందీ వివరిస్తూ ఓ పే.....ద్ద నవల రాసిపారేశాడు. అప్పట్లో అభిమానం అలాంటిది మరి. తర్వాత కాలంలో చాలా మార్పులొచ్చేశాయ్. రాజకీయంలోకి అడుగుపెడితే రెండు చేతులేంటి వందచేతులతో డబ్బులు పోగేసుకోవచ్చు.. అని ఐనవాళ్లు సలహా ఇచ్చారు. అరగేట్రంకూడా చాలా గ్రాండ్ గా జరిగింది. కానీ.. చివరికి నమ్ముకున్నవాళ్లంతా నట్టేట మునిగారు. ఏదో ఒరుగుతుందని నమ్మివచ్చినవాళ్లంతా మట్టికొట్టుకుపోయారు. అయినా సదరు మహావ్యక్తికి ధనదాహం తీరలేదు. తనను అభిమానించే వాళ్లని అడ్డంగా వాడుకోవడానికి ముందునుంచీ నడుపుతున్న దేశోద్ధరణ కార్యక్రమాల్నికూడా సంపాదనకోసం ఉపయోగించుకుందామన్న యావ ఎక్కువైపోయింది. పేదవాడి రక్తపు చుక్కల్నికూడా డబ్బుల్లోకి మార్చేసుకోవచ్చన్న కొత్త ఆలోచన పుట్టుకొచ్చింది.

డబ్బులే డబ్బులు.. కుక్కని కొడితే డబ్బులు రాలుతున్నాయ్.. ఉన్న ఇమేజ్ కి తోడు కొత్తగా పవర్ కూడా తోడవడంతో ఏదైనా జరిగితే అప్పటికప్పుడు మ్యానేజ్ చేసుకోవడం చాలా వీజీ అయిపోయింది. అరాచకాలకు అడ్డేలేకుండా పోయింది. సదరు మహావ్యక్తి జీవనపయనం నిరుపేదగా మొదలైంది. తర్వాత జీవితమే నాటకమైపోయింది. కష్టపడి పైకొచ్చాడని అంతా పొగిడారు. కానీ.. ఆ కష్టం వెనక ఎన్ని మతలబులు, ఎన్ని నిజజీవితపు రాజకీయాలూ ఉన్నాయో.. బాగా దగ్గరగా ఎరిగిన రచయితగారికి చాలాకాలం తర్వాత తెలిసొచ్చింది. మహావ్యక్తికి వీరాభిమాని అయిన రచయితకు మాత్రం కళ్లెదుటే జరుగుతున్న అరాచకాల్ని చూసి కడుపుమండిపోయింది. వెటరన్ నావెలిస్ట్ బుచ్చిబాబుని ఆదర్శంగా తీసుకుని, ఎన్ని కడుపులు కొట్టి ఎంత కూడబెట్టినా చివరికి మిగిలేదేంలేదు బూడిదతప్ప అన్న నిజాన్ని నూరిపోసే కొత్త నవల రాసేందుకు సిద్ధపడ్డాడు. తన లేటెస్ట్ ప్రాజెక్ట్ ని ఎంత త్వరగా మార్కెట్లోకి విడుదల చేయాలా..? ఎంత త్వరగా తను అభిమానించిన మహావ్యక్తి దిగజారుడుతనాన్ని కళ్లకు కట్టినట్టు జనానికి చెప్పాలా.. ? అన్న తహతహ రచయితకు పెరిగిపోయింది. ఇదేదో చాలా వెరైటీగా మార్కెట్లోకొచ్చేట్టుగా ఉందని పాఠకులుకూడా యమ ఆసక్తిగా ఆ కొత్త నవలకోసం ఎదురుచూస్తున్నారు. రచనాగ్రేసరుడి కొత్త నవలకు ఎంత పాపులారిటీ రాబోతోందో కాలమే నిర్ణయించాలి

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్ర పాలనా కేంద్రమైన బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
సింగరేణి కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది.
అధికారులు వస్తుంటారు.. పోతుంటారు.. నేను లోకల్.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఫైర్..!
ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు..!
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో అత్యంత కట్టుదిట్ట మైన భద్రత మధ్య ఉన్న మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన బ్యారక్‌లో భారీ ఆయుధాల చోరీ కలకలం రేపింది.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది.
తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
హర్షం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..!
హైదరాబాద్‌ రాయదుర్గం పరిధిలో జరిగిన హిట్‌ అండ్‌ రన్‌ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
సికింద్రాబాద్‌లోని  కట్టుదిట్టమైన భద్రత ఉండే మద్రాస్ రెజిమెంట్ లో  ఆయుధాగారం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు మాయమవ్వడం ఆందోళన కలిగిస్తోంది.  
లంగాణ కాంగ్రెస్ లో ఇటీవలి వివాదాల నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విషయంలో కేంద్రం క్లియర్ కట్ సందేశాలు ఇవ్వడం, సీఎం, టీపీసీసీ చీఫ్ లను హస్తినకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రస్తుత కేబినెట్ నుంచి.. కొండా సురేఖ తో పాటు మరో ఇద్దరు మంత్రులను తొలగించే అవకాశం ఉ:ది. వారిరువురూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారే కావడం గమనార్హం. వారి స్థానంలోమరో ముగ్గురు కొత్త వారికి చోటు కల్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ పరిసరాల్లోని బంగాళాఖాతంలో ఏర్పడిన  అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితలంలో కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ సమాచారం మేరరు రానున్న నాలుగైదు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.
అమెరికాలో కూతురి పెళ్లి.. వీడియో కాల్‌ ద్వారా నూతన జంటను ఆశీర్వదించిన పేరెంట్స్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.