హింస ఓ ఫ్యాషనైంది..!
Publish Date:Sep 6, 2012
Advertisement
తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా వస్తున్న వాహనదారుడిని పోలీసులు ఆపాలని కోరినా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడంతో ఓ కానిస్టేబుల్ వాహనదారుడిపై లాఠీవిసరడంతో బండిపై ఉన్న ఇద్దరూ కిందపడిపోయారని, ఒకరికి గాయాలయ్యాయని సంఘటన చూసిన ప్రత్యక్ష సాక్షి చెప్పారు. అయితే పోలీసులు హెల్మెట్ లేకుండా వెళుతున్న వాహనదారుడిని ఆపమని కోరామని మద్యం సేవించివుండటంతో వాహనాన్ని అదుపుచేయలేకపడిపోయారని పోలీసులు వెల్లడిస్తున్నారు. అయితే నేను కుందేలుకు ఒక కొమ్ము చూశానని ఒకడంటే, మరొకడు నేను రెండు చూశానన్నట్ట...! అలాగే వాహనదారుడికి గాయాలయ్యాయని కొందరు, కాదు ఒకరు చనిపోయారంటూ మరికొందరు అంటున్న నేపథ్యంలో స్థానికంగా నివశించే కొందరు యువకులు ప్రయాణికుల బస్సులు, పలుషాపులు, ద్విచక్రవాహనాలకు నిప్పంటించేశారు. అంతేకాకుండా, సమీప పోలీస్‌పోస్ట్ వద్దకు వెళ్ళి రాళ్లు రువ్వడం ప్రారంభించేశారు. ఈ గొడవలు చేసేది వాహనదారుడికి సంబంధించనవారేనా అంటే నిజం తెలియదు.. ఏదో అల్లర్లు చేయాలి కాబట్టి... దానికి ఒక కారణం.. కావాలి... అన్నట్లుగా తయారయ్యంది నేటి పరిస్థితి. వాస్తవాలను గుర్తించి తప్పుచేసింది ఎవరైనా శిక్షపడాల్సిందేనంటున్నారు సాధారణ ప్రజానీకం...!
http://www.teluguone.com/news/content/హింస-ఓ-ఫ్యాషనైంది-24-17165.html





