విజయనగరం లో మావోల పాగా?
Publish Date:Feb 18, 2012
Advertisement
పోలీస్-మావోల మధ్య నలుగుతున్న గిరిజనం
విజయనగరం: విజయనగరం జిల్లాలో మావోయిస్టుల కదలికలు మళ్ళీ ప్రారంభమయ్యాయి. మావో దళాలు తరచుగా గిరిజన గ్రామాలను సందర్శిస్తూ గిరిజనులను దళాల్లోకి రిక్రూట్ చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో జిల్లా పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. మావోల కదలికలు, పోలీసులు కూంబింగ్ లు కారణంగా గిరిజనులు అల్లాడుతున్నారు. ఒకవైపు మావోయిస్టుల ఆచూకి తెలపాలంటూ పోలీసులు బెదిరిస్తుంటే పోలీస్ ఇన్ ఫార్మర్లుగా మారితే చంపేస్తామంటూ మావోయిస్టులు హెచ్చరిస్తున్నారు. దుగ్గెరు గ్రామం రామమందిరం ఎదుట శ్రీకాకుళం, కోరాపుట్ గిరిజనుల కమిటి పేరుతో వాల్ పోస్టర్లు వెలిశాయి. గిరిజనుల భూ పోరాటానికి వ్యతిరేకంగా వ్యవహరించిన పోలీసులకు సమాచారం అందించిన అటువంటి వారిని కఠినంగా శిక్షిస్తామని ఆ వాల్ పోస్టర్లో మావోయిస్టులు హెచ్చరించారు. మరోవైపు పోలీసులు అమాయక గిరిజనులను మావోయిస్టుల సమాచారం కోసం హింసిస్తున్నారు. ఇటీవల పోలీసులు నారాయణ పట్నం బ్లాకు దిగువలచ్చ గ్రామానికి చెందిన కొండ తామర లస్సు, పాలక సభ్యులను నక్సలైట్ ఇన్ ఫార్మర్ అంటూ అరెస్ట్ చేశారు. దీంతో గిరిజన గ్రామాల్లో భయాందోళనలు వ్యాపించాయి.
http://www.teluguone.com/news/content/vijayanagaram-24-12005.html





