ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం (ఏప్రిల్ 9) రాత్రి జరిగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. మ్యాచ్ లో విజయం చివరి వరకూ ఇరు జట్లతోనూ దోబూచులాట ఆడింది. అయితే చివరకు లక్నో బ్యాటర్ అద్భుత బ్యాటింగ్ పుణ్యమా అని ఓటమి అంచుల నుంచి గెలుపు బావుటా ఎగుర వేసింది లక్నో జయంట్స్. ఓటమి ఖాయమని పరిస్థితిలో యువ ఆటగాడు ముకుల్ చౌదరి క్రీజులోకి వచ్చి మ్యాచ్ ఫలితాన్ని తలకిందులు చేశాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఈ హోరాహోరీ పోరులో లక్నో 3 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. చివరి బంతి వరకూ విజయం ఎవరిదన్న విషయంలో ఉత్కంఠ నెలకొంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. స్కిప్పర్ అజింక్యా రహానే 41 పరుగులు, రఘువంశి 45 పరుగులతో రాణించారు. చివరిలో రోవ్మన్ పావెల్ 39 పరుగులు సాధించడంతో కోల్ కతా 181 పరుగులు చేయగలిగింది.
ఇక 182 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో జయింట్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. మార్ష్ 15 పరుగులు, మార్కరమ్ 22 పరుగులు, రిషబ్ పంత్ డకౌట్ తో త్వరగానే ఔటు కావడంతో లక్నో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ సమయంలో బ్యాటింగ్ కు దిగిన ఆయుష్ బదోనీ హాఫ్ సెంచరీ సాధించి లక్నోకు విజయంపై ఆశలు రేకెత్తించాడు. అయితే 54 పరుగులు చేసిన బదోనీ కీలక సమయంలో అవుట్ కావడంతో లక్నో జయింట్స్ మళ్లీ కష్టాల్లో పడింది. ఇక గెలుపు అసాధ్యమన్న పరిస్థితిలో పడింది. సరిగ్గా ఆ సమయంలో క్రీజ్ లోకి వచ్చాడు ముకుల్ చౌదరి. ఓటమి అంచుల్లో ఉన్న లక్నో జయింట్స్ ను ఒంటి చేత్తో గెలిపించాడు. 27 బంతుల్లోనే 2 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జట్టును గెలిపించాడు. చివరి ఓవర్ లో విజయానికి 14 పరుగులు అవసరం అయిన దశలో వైభవ్ ఆరోరా వేసిన ఆ ఓవర్లో ముకుల్ చౌదరి రెండు సిక్సర్లు బాది లక్నోకు విజయాన్ని అందించాడు.
ఈ విజయం లక్నో శిబిరంలో ఆనందాన్ని నింపింది. మ్యాచ్ ముగిసిన తరువాత లక్నో జయంట్స్ యజమాని సంజీవ్ గోయెంకా స్వయంగా మైదానంలోకి వచ్చి ముకుల్ చౌదరిని అభినందించాడు. అతని బ్యాటింగ్ ను వేనోళ్ల పొగుడుతూ చాలా సేపు అతడితో ముచ్చటించారు. ఇక మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ముకుల్ చౌదరి క్రికెటర్ అవ్వాలన్నది తన తండ్రి కల అని చెప్పాడు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/victory-plays-hideandseek-36-217040.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.