ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల యాజమాన్య హక్కులపై నమ్మకాన్ని పెంచేలా ప్రభుత్వం ముందడుగు వేసింది. నంద్యాల జిల్లా ధోన్ నియోజకవర్గంలోని కొత్తబురుజు గ్రామంలో జరిగిన మీ భూమి - మీ హక్కు'కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. రైతులకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేశారు. భూ రికార్డుల భద్రత కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీని, క్యూఆర్ కోడ్‌ను ప్రవేశపెట్టడం ద్వారా రెవెన్యూ వ్యవస్థలో పెనుమార్పులకు ఈ పట్టాదార్ పాసుపుస్తకాల ద్వారా శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు.. జగన్ హయాంలో భూ రికార్డుల విషయంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తుచేశారు. మునుపటి ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు శాపంగా మారిందన్న ఆయన తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేశామన్నారు. భూమి కేవలం ఆస్తి మాత్రమే కాదని, అది రైతులకు ఆత్మగౌరవంతో కూడిన సెంటిమెంట్ అన్నారు.
కొత్తగా రూపొందించిన పాస్ పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ సదుపాయం కల్పించినట్లు చంద్రబాబు వెల్లడిం చారు. ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు, భూమికి సంబంధించిన పూర్తి వివరాలు, మ్యాపులు వెనువెంటనే ప్రత్యక్షమవుతాయి. దీనివల్ల రికార్డుల ట్యాంపరింగ్‌కు ఇసుమంతైనా అవకాశం ఉండదన్నారు. ఒకసారి బ్లాక్ చైన్ సిస్టమ్‌లోకి డేటా వెళ్ళాక, ఉన్నతాధికారులు సైతం యజమాని అనుమతి లేకుండా మార్పులు చేయలేరని చంద్రబాబు చెప్పారు.
ఇప్పుడు పంపిణీ చేస్తున్న పాస్ పుస్తకాలపై అధికారిక రాజముద్ర మాత్రమే ఉంటుందన్నారు. ఈ పాసు పుస్తకాలను ఎటువంటి అదనపు రుసుము లేకుండా ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 16,816 గ్రామాలు ఉండగా, ఇప్పటివరకు చాలా గ్రామాల్లో గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తయిందన్న చంద్రబాబు.. 2027 నాటికి ఆంధ్రప్రదేశ్ ను భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/qr-codes-on-pattadar-passbooks-36-217019.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.