Publish Date:Jan 29, 2025
రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని అడ్డంగా దొరికిపోయినట్లే కనిపిస్తోంది. భారీ మొత్తంలో బియ్యం మాయం వెనుక పేర్ని నాని హస్తం ఉన్నట్లు పోలీసులు నిర్దారణకు వచ్చారు. ఇదే విషయాన్ని పేర్నినాని కేసువిచారణ సందర్బంగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు. బియ్యం మాయం కేసులో పేర్ని నాని ప్రమేయానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొన్నారు. సాధారణంగా ఉద్యోగికి యజమాని ఖాతా నుంచి వేతనం సొమ్ములు వెడతాయనీ, కానీ బియ్యం మాయం కేసులో మాత్రం గోదాము మేనేజన్ ఖాతా నుంచి పేర్ని నానికి సొమ్ములు బదిలీ అయ్యాయనీ, అది రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించి అమ్మిన సొమ్మేననీ పోలీసుల విచారణలో తేలిందనీ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలూ విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అయితే ఇప్పటికే పోలీసులకు తొందరపాటు చర్యలు వద్దంటూ ఇచ్చిన ఉత్తర్వ్యులను పొడిగించింది.
అయితే ఈ కేసు విషయంలో పేర్ని నాని, ఆయన సతీమణి జయసుధ పూర్తిగా ఇరుక్కున్నట్లునని న్యాయ నిపుణులు అంటున్నారు. వైసీపీ హయాంలో పేర్ని నాని తన సతీమణి జయసుధ పేరిట గోదాములను నిర్మించి, వాటిని పౌరసరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారు. అయితే వైసీపీ ప్రభుత్వం పతనమై తెలుగుదేశం కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత పేర్ని నాని సతీమణికి చెందిన గోదాములలో రేషన్ బియ్యం పెద్ద ఎత్తున మాయం అయ్యిందని అధికారుల తనిఖీలలో బయటపడింది. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు. తొలుత పేర్ని జయసుధ, గోడౌన్ మేనేజర్ మనస తేజ్, పౌరసరఫరాల అధికారి కోటిరెడ్డితో పాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణలో మానసత్ తేజ్, కోటిరెడ్డితోపాటు మరో ఇద్దరి మధ్య దాదాపు పాతిక నుంచి 30 లక్షల రూపాయల మేర లావాదేవీలు జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. అంతే కాకుండాపేర్ని నాని కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలకు కూడా మానస్ తేజ్ బ్యాంకు ఖాతా నుంచి లక్షల్లో లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పరిస్థితిలో తేడా వచ్చిన రేషన్ బియ్యం మొత్తానికి డబ్బులు చెల్లిస్తామని పేర్ని నాని కుటుంబం అధికారులకు లేఖ రాసింది. రూ.3.37 కోట్లకుపైగా విలువైన బియ్యం మాయమైందని అధికారులు అంచనాకు వచ్చారు. తొలుత రూ.1.70కోట్లు చెల్లించాలని సూచించగా.. పేర్నినాని కుటుంబం ఆ మొత్తాన్ని చెల్లించింది. మూడు రోజుల కిందట మరో రూ.1.67 కోట్లు చెల్లించాలని అధికారులు పేర్ని నాని కుటుంబానికి నోటీసులు ఇచ్చారు.
కాగా ఈ కేసులో ఏ1గా ఉన్న జయసుధ కోర్టును ఆశ్రయించడంతో ఆమెకు ముందస్తు బెయిలు లభించింది. అయితే విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. ఇక ఈ కేసులో ఏ2, ఏ3, ఏ4, ఏ5లుగా ఉన్న మానస్ తేజ్, కోటిరెడ్డి, లారీ డ్రైవర్ మంగారావు, రైస్ మిల్లర్ ఆంజనేయులును పోలీసులు అరెస్టు చేసి విచారించారు. ఆ విచారణలో వీరు గోదాములో బియ్యం మాయం వెనుక పేర్ని నాని ప్రమేయం ఉందని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు పేర్ని నానిని ఈ కేసులో ఏ6గా చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లారు. ఇప్పుడు కోర్టు తీర్పు రిజర్వ్ చేయడంతో రాజకీయ వర్గాలలో నాని అరెస్టౌతారా, అవ్వరా అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. న్యాయ నిపుణులు మాత్రం రేషన్ బియ్యం మాయం కేసులో నాని పూర్తిగా ఇరుక్కున్నారన్న అభిప్రాయమే వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/verdict-reserve-in-perni-nani-case-39-192021.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.