ఎన్డీయేకు జగన్ మద్దతు: షరతు నిజంగానే వర్తిస్తుందా?

Publish Date:Nov 27, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అవసరమైన ప్రతి సందర్భంలోనూ ఎన్డీయేకు మద్దతు పలుకుతూ వస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

అయితే జగన్ కు మాటతప్పడం, మడమ తిప్పడం అలవాటేననీ, బయటకు ఎన్ని కబుర్లు చెప్పినా బీజేపీకి నచ్చని విధంగా ఆయన వ్యవహరించే అవకాశం లేదనీ పరిశలకులు పలు సందర్భాలలో విశ్లేషించారు. వారి విశ్లేషణలకు తగినట్లుగానే జనగ్ డీ లిమిటేషన్ బిల్లుకు మద్దతు పలకాలని నిర్ణయించుకున్నారు.

అయితే అలా మద్దతు పలకడానికి ఒక షరతు  విధించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ షరతుకు బీజేపీ అంగీకరిస్తేనే లోక్ సభలో డీలిమిటేషన్ బిల్లుకు వైసీపీ మద్దతు ఉంటుందని అంటున్నాయి. 

పార్లమెంటులో రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న దామాషా ప్రాతినిధ్యాన్ని కాపాడాలన్నదే ఆ షరతు అని చెబుతున్నాయి.  ఇప్పటికే లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ సమీకరణాలు కీలకంగా మారిన సమయంలో, ప్రాంతీయ పార్టీల వైఖరి ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇది కూడా చదవండి: అప్పుడు బొద్దింకలకు జై: ఇప్పుడు మోడీకి జైజై.. కన్ఫ్యూజన్ లో జగన్.!​

విపక్ష కూటమిలోని ఇతర పార్టీలు ఈ బిల్లుపై విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో వైసీపీ మద్దతు పలకడానికి ముందుకు రావడం గమనార్హం.  వైసీపీకి రాజ్యసభలో నలుగురు, లోక్ సభలో నలుగురు ఎంపీలు ఉండటంతో.. వైసీపీ మద్దతు ఎన్డీయేకి కీలకంగా మారింది. 

అది పక్కన పెడితే..కేంద్రం ఇప్పటికే ప్రస్తుత దామాషా ప్రాతినిథ్యానికి భంగం కలగకుండా సీట్లను పెంచే ఫార్ములాపై కేంద్రం కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. అందుకే వైసీపీ ఆ షరతు విధించిందనీ, ఒక వేళ కేంద్రం అటువంటి కసరత్తు చేసి ఉండకపోయినా వైసీపీ కేంద్రానికి మద్దతుగా నిలబడి ఉండేదనీ, గతంలో జరిగిన సంఘటనలను ఉటంకిస్తూ పరిశీలకులు చెబుతున్నారు.  

మీకు నచ్చవచ్చు: కాళ్లు మొక్కబోయిన జగన్.. వద్దన్న మోదీ

ఏపీ రాజకీయాల్లో మోదీ వ్యూహాలు...జగన్ సైలెంట్ స్ట్రాటజీ ఎటువైపు?​

[YCP, Support, NDA,  Delimitation Bill, Jagan, Condition, TeluguOne]

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.