మోడీ నెత్తిన పాలు పోసిన కాంగ్రెస్: ఇండియా కూటమిలో విభేదాలు రాహుల్ పుణ్యమేనా.?

Publish Date:Nov 28, 2026

Advertisement

కాంగ్రెస్ తనంత తానుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి సర్కార్ కు ప్రయోజనం చేకూర్చిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తమిళనాడులో టీవీకే ప్రభుత్వాన్ని గద్దెనెక్కించేందుకు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మోడీ సర్కార్ కు ఆయాచిత వరంగా పరిణమించింది. తమిళనాడు విషయంలో కాంగ్రెస్ తీసుకున్న ఒక రాజకీయ నిర్ణయం  జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు  అనూహ్య లబ్ధిని చేకూర్చిపెట్టింది.  ఆ నిర్ణయమే ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలతో సంబంధాలను సమన్వయం చేసుకోవడం, బలోపేతం చేసుకోవడంలో కాంగ్రెస్ వైఫల్యాలను జాతీయ స్థాయిలో తిరుగులేని విధంగా బదనాం చేసింది.  తమిళనాడులో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు పలకడం ద్వారా దశాబ్దాలుగా తోడుగా ఉన్న డీఎంకేను కాంగ్రెస్ చేజేతులా దూరం చేసుకుంది. ఇప్పుడు అదే ఎన్డీయే కూటమికి కలిసి వచ్చింది. అంతే కాకుండా ఇండియా కూటమిని బలహీన పరిచి.. కాంగ్రెస్ కు ఇసుమంతైనా రుచించని, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటు ఆమోదం పొందేందుకు దోహదం చేస్తున్నది.


గత ఏప్రిల్‌లో పార్లమెంటులో అవసరమైన మెజారిటీ లేక డీలిమిటేషన్ బిల్లు వీగిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సమయం కోసం వేచి చూసిన మోదీ-షా ద్వయం.. అదును చూసి పార్లమెుంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మరీ ఆ బిల్లుకు ఆమోదం పొందేందుకు పక్కాగా వ్యూహరచన చేసింది.  ఈ బిల్లు ఆమోదంలో ఇప్పుడు 22 మంది లోక్‌సభ సభ్యులున్న డీఎంకే కీలక పాత్ర పోషిస్తోంది. గతంలో ఎప్పుడూ కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమికి వెన్నెముకగా నిలిచిన డీఎంకే.. తమిళనాడులో విజయ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ కు దూరం జరుగుతూ వచ్చింది. 

ఇప్పుడు  22 మంది ఎంపీల బలం ఉన్న డీఎంకే డీలిమిటేషన్ బిల్లుకు సానుకూలంగా ఉందన్న వార్తలు, గతంలో టీవీకేకు మద్దతు ఇవ్వడం రాజకీయంగా కాంగ్రెస్ కు ఆత్మహత్యాసదృసంగా మారిందన్న విషయాన్ని ఎత్తి చూపుతున్నాయి.  సరిగ్గా ఇదే అవకాశాన్ని అందిపుచ్చుకున్న బీజేపీ అగ్రనాయకత్వం, డీఎంకే ప్రధాన డిమాండ్లకు అనుగుణంగా బిల్లులో మార్పులు చేసి వారి మద్దతు  సాధించింది. తమిళనాడు సహా ఏ   రాష్ట్రంలోనూ సీట్ల నిష్పత్తి తగ్గకుండా అన్ని రాష్ట్రాల్లోనూ 50 శాతం మేర లోక్‌సభ స్థానాలను పెంచేందుకు కేంద్రం అంగీకరించడం ద్వారా డీఎంకే మద్దతు సాధించడమే కాకుండా, కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బతీయగలిగింది.  

దీనికి తోడు, పాతికేళ్ల  రాష్ట్రాల మధ్య సీట్ల సంఖ్య వాటాను స్థిరంగా కొనసాగించాలన్న డీఎంకే మరో ప్రధాన షరతుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపడం, అలాగే ఎన్సీపీ( శరద్ పవార్ )వర్గంతోనూ   సంప్రదింపులు జరిపి మద్దతు కూడగట్టడంలో మోడీ షా ద్వయం సక్సెసయ్యింది. ఈ విధంగా టీవీకేకు తమిళనాడులో మద్దతు పలకడం ద్వారా కాంగ్రెస్ ఇండియా కూటమికి రెండు కీలక రాజకీయపార్టీలు దూరం కావడానికి కారణమైంది.

ఇది కూడా చదవండి:  ఇండియా కూటమిలో సంక్షోభం.. కాంగ్రెస్ ను వీడుతున్న మిత్రపక్షాలు​

ఇప్పుడు డీఎంకే, ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీల మద్దతుతో పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీకి ఎన్డీయే చేరువ అయ్యింది. తద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా..  మహిళా రిజర్వేషన్ల అమలు క్రెడిట్‌ను,   మరోవైపు డీలిమిటేషన్ ఘనతను మోడీషా ద్వయం తమ ఖాతాలో వేసుకునే అవకాశం దక్కించుకుంది. అదే సమయంలో కూటమి విభేదాలు జాతీయ స్థాయిలో రచ్చకెక్కేలా చేయగలిగింది. 

  పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మీకు నచ్చవచ్చు: ప్రధాని అభ్యర్థిగా రాహుల్.. ఇండియా కూటమి పార్టీలు ఓకే.!​

ఇండియా కూటమిలోకి జగన్?​

[Congress, StratagicFailur, Tamilnadu, TVK Support, Delimitation,  Cut, DMK, INDIA Alliance, TeluguOne]

By
en-us Political News

  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.